నాని హీరోగా తెరకెక్కుతోన్న సినిమా 'ఎంసీఏ - మిడిల్ క్లాస్ అబ్బాయి'. ఈ సినిమా జనాల్లోకి బాగా ఎక్కేసింది. ఎంసీఏ ఫీవర్ బాగా కనిపిస్తోంది ఆడియన్స్‌లో. ఇదో సాధారణ ఎంటర్‌టైనర్ అంతే. మరో పక్క అఖిల్ రీ లాంఛింగ్ మూవీ 'హలో' కూడా విడుదల కానుంది. ఇదో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం. ఈ రెండు చిత్రాలూ పోటా పోటీగా ఈ నెలలో ఒక్క రోజు గ్యాప్‌లో విడుదలవుతోన్న సంగతి తెలిసిందే.
అయితే మా మధ్య పోటీ ఆరోగ్యకరమైనదే. ముందు నేనొచ్చి అఖిల్‌కి 'హలో' చెబుతానన్నట్లుగా నాని సంకేతాలు పాస్ చేస్తున్నాడు. రొటీన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న సినిమా అయినప్పటికీ నాని 'మిడిల్ క్లాస్ అబ్బాయి' ప్రోమోస్ చాలా ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న అఖిల్ 'హలో' ప్రీ రిలీజ్ ప్రమోషన్ విషయంలో 'ఎంసీఏ'తో పోల్చితే కొంచెం వెనకబడినట్లు కనిపిస్తోంది. పండగ సీజన్‌లో మాస్త్ ఎంటర్‌టైనర్‌ని ఇష్టపడేవారు ఎంసీఏని ప్రిఫర్ చేస్తారు. అలాగే కొంచెం విభిన్నంగా ఆలోచించేవారు అఖిల్ 'హలో'కి ఓటేసే అవకాశాలున్నాయి.
'ఎంసీఏ'తో పోల్చితే 'హలో' భారీ బడ్జెట్‌తో భారీ అంచనాలతో తెరకెక్కిన సినిమా. కానీ ఇప్పుడు నాని టైం రాకెట్ స్పీడుతో దూసుకెళ్తోంది. ఆ రకంగా నాని 'ఎంసీఏ'ని తక్కువగా అంచనాల వేయలేం. అయితే క్రిస్‌మస్ సందర్భంగా వరుస సెలవులు కలిసి రావడం ఈ రెండు సినిమాలకూ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఏమాత్రం పోజిటివ్ టాక్ వచ్చినా రెండు సినిమాలు అనూహ్య విజయం సాధించడం పక్కా. తెలుగు రాష్ట్రాల్లో సంగతి ఇలా ఉంటే, అటు ఓవర్సీస్‌లోనూ ఈ రెండు సినిమాలూ పోటీగానే బిజినెస్ అయ్యాయి. నానికి ఓవర్సీస్ మార్కెట్ కూడా ఎక్కువే. అక్కడ నాని సినిమాలకు పిచ్చ క్రేజ్ ఉంది. అందులో ఈ 'ఎంసీఏ' పై మరిన్ని అంచనాలున్నాయి. ఇక 'హలో'పై కూడా అక్కడ భారీగానే అంచనాలున్నాయి. ఇప్పటికే 'హలో' ప్రమోషన్స్ అమెరికాలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. చూడాలి రిజల్ట్ ఎలా ఉండబోతోందో!