హేమ కి రిలీఫ్ దొరికిందా?

మరిన్ని వార్తలు

గత కొన్ని రోజులుగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన హేమ ఇప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకుంది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయ్యి పరప్ప అగ్రహార జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న హేమకి బెయిల్ మంజూరు అయ్యింది.  జూన్ 12 బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ స్పెషల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రేవ్ పార్టీలో హేమ దొరకటం టాలీవుడ్ లో కలకలం రేపిన సంగతి తెలిసందే. తరవాత తరవాత అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొదట తాను ఆ పార్టీలో లేనని నమ్మబలికింది. కానీ బెంగుళూర్ పోలీసులు ఆధారాలతో సహా ఆమె ఉన్నట్లు బయట పెట్టారు. అంతే కాదు హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా కన్ఫర్మ్ చేసారు.  దీనితో విచారణకి  రావాల్సిందిగా నోటీసులు పంపారు. మొదటి సారి ఏవో షాక్ లు చెప్పి వెళ్లని హేమ రెండో సారి వెళ్లి అరెస్ట్ అయ్యింది. 


ఈ విచారణలో అనేక విషయాలు వెల్లడించారు బెంగుళూర్ పోలీసులు. హేమ పార్టీ కి గెస్ట్ కాదు హోస్ట్ అని నిర్దారించారు. ఆమె ఈ పార్టీకి కీలకమని కూడా తేటతెల్లం అయ్యింది. కానీ ఇప్పుడు కోర్టులో ఈ రేవ్ పార్టీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమ నుంచి ఎలాంటి డ్రగ్స్  దొరకలేదని, వైద్య పరీక్షలు కూడా నిర్వహించినట్టు ఆమె తరపు న్యాయవాది మహేష్ కిరణ్ శెట్టి వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న కోర్టు హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హేమ నిజంగానే తప్పు చేయలేదా? మరి బెంగుళూర్ పోలీసులు చెప్తున్నదాంట్లో నిజం లేదా ? ఈ విషయాలపై పలు సందేహాలు వెలువడుతున్నాయి. 


అయినా ఇప్పుడు హేమ తప్పు చేయలేదని నమ్మే వారున్నారా? ఇప్పటికే  'మా ఆర్టిస్ట్ అసోసియేషన్' కూడా హేమ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఒకసారి డ్రగ్స్ కేస్ లో పట్టుబడితే అది చివరి వరకు వెంటాడుతూనే ఉంటుంది అనేది నిజం. హైదరాబాద్ లో ఎక్కడ డ్రగ్స్ దొరికినా ఇప్పటికీ నవదీప్ ని టార్గెట్ చేస్తూనే ఉంటారు. బెంగుళూర్ రేవ్ పార్టీ కేస్ లో నా పేరు వినిపించలేదు సంతోషం అని నవదీప్ కామెంట్ కూడా చేసాడు. ఇప్పుడు ఆ లిస్ట్ లో హేమ కూడా చేరిందా అనేది చూడాలి. రీసెంట్ గా క్రిష్ కూడా ఇలాంటి కేస్ లో ఇరుక్కుని నిర్దోషిగా బయటపడ్డాడు. మరి హేమ సంగతేంటో తెలియాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS