`రన్ రాజా రన్` అనే ఓ చిన్న సినిమాతో.. ప్రభాస్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు సుజిత్. అది కూడా పాన్ ఇండియా సినిమా. అదే.. `సాహో`. రెండో సినిమాకే దాదాపుగా 300 కోట్ల బడ్జెట్ ని మోసిన దర్శకుడు సుజిత్. అయితే `సాహో` ఫలితం అంత ఆశాజనకంగా రాలేదు. ప్రభాస్ ఫ్యాన్స్ సైతం నిరాశ పడ్డారు. తెలుగులో బిలో యావరేజ్ గా నిలిచిన సాహో.. బాలీవుడ్ లో మాత్రం మంచి వసూళ్లు సాధించింది. అందుకే.. సుజిత్ ని తెలుగు నిర్మాతలు పట్టించుకోకపోయినా బాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది.
అక్కడి జీ స్టూడియోస్ సుజిత్ తో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. సుజిత్ వాళ్ల కోసం ఓ భారీ యాక్షన్ చిత్రాన్ని తీయబోతున్నాడు. ఈ యేడాదే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. అయితే ఇందులో నటించే హీరో ఎవరో డిసైడ్ అవ్వలేదు. బాలీవుడ్ కి చెందిన ఓ అగ్ర కథానాయకుడే నటిస్తాడని తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లో హీరో ఎవరన్న విషయంలో ఓ క్లారిటీ వస్తుంది. అయితే ఈసారి యాక్షన్ తో పాటు, ఎమోషన్ డ్రామాని కూడా మిక్స్చేశాడని సుజిత్ చెబుతున్నాడు. ఈసారైనా... తన ప్రయత్నం పూర్తి స్థాయిలో నెవరేరుతుందో, లేదో చూడాలి.