విప్పేసినా.. 'హిప్పీ' పిప్పయ్యిందిగా!

By iQlikMovies - June 06, 2019 - 16:00 PM IST

మరిన్ని వార్తలు

అబ్బో 'హిప్పీ' గురించి చెప్పి చెప్పి విసుగెత్తిపోయారా.? ఇక ఆ అవసరం లేదులెండి. సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. రిజల్ట్‌పై కూడా ఓ ఐడియాకొచ్చేశారు ఆడియన్స్‌. ఓపెనింగ్స్‌కి మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా, వీకెండ్‌లో సినిమా పుంజుకునే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే, 'హిప్పీ'లో ఉన్న స్టఫ్‌ అలాంటిది మరి. ఇప్పుడంతా ఈ స్టఫ్‌కే కదా అలవాటు పడింది. అందుకే మనోడు తెలివిగా ఆలోచించి, తన డెబ్యూ మూవీ 'ఆర్‌ఎక్స్‌ 100'కి ఏమాత్రం తీసిపోకుండా, 'హిప్పీ' కంటెంట్‌కి ఓకే చేశాడు.

 

అయితే రిజల్ట్‌ అదరగొట్టిందా.? బెడిసికొట్టిందా.? అనేది అప్పుడే తేల్చేయలేం కానీ, టాక్‌ మాత్రం మిక్స్‌డ్‌గా వినిపిస్తోంది. సినిమాకి ప్రమోషన్స్‌ బాగా చేశారు. ఈ రోజు ఈ సినిమా తప్ప మరో సినిమా లేకపోవడంతో, మొదటి ఆటకు బాగానే క్యూరియాసిటీ నెలకొంది. అయితే మాస్‌ సెంటర్స్‌లో 'హిప్పీ'కి రిజల్ట్‌ బెటర్‌గా ఉన్నా, క్లాస్‌ సెంటర్స్‌లో ఇంకా ఫైనల్‌ చేయలేని పరిస్థితి. వీకెండ్‌ వస్తే కానీ, ఇంకా చెప్పలేం. ఇద్దరు ముద్దుగుమ్మలు దిగంగనా సూర్యవంశీ, జజ్బాసింగ్‌ గ్లామర్‌కి తోడు మరో హాట్‌ బ్యూటీ శ్రద్ధాదాస్‌ కూడా తనవంతు గ్లామర్‌ పండించింది. టోటల్‌గా లవర్‌బోయ్‌ కార్తికేయ 'హిప్పీ'తో ఫుల్‌ ఆఫ్‌ రొమాంటిక్‌ థ్రిల్‌ అయితే ఇచ్చి, ఇది నిజం.. 'హిప్పీ' నయా ట్రెండ్‌ యూత్‌ఫుల్‌ కంటెంట్‌ మూవీ అని నిరూపించాడు. మరి యూత్‌ని కొత్తగా ఏమైనా ఆకట్టుకున్నాడా.? లేక ఈ లవ్వు మాక్కూడా ఎక్స్‌పీరియన్సే బాస్‌.. అంటూ మనోడ్ని లైట్‌ తీసుకుంటారా.? అనేది చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS