హిట్ జోన్‌లో ప‌డిపోయిన క‌ల్యాణమండ‌పం

By iQlikMovies - August 09, 2021 - 10:42 AM IST

మరిన్ని వార్తలు

సెకండ్ వేవ్ త‌ర‌వాత‌... టాలీవుడ్ కి తొలి హిట్ దొరికింది. గ‌త వారం విడుద‌లైన‌.. `తిమ్మ‌రుసు` ఏవరేజ్ అనిపించుకుంటే, ఈ వారం వ‌చ్చిన `ఎస్‌.ఆర్‌.క‌ల్యాణ‌మండపం` హిట్ బాట ప‌ట్టింది. కిర‌ణ్ అబ్బ‌వ‌ర‌పు క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్ర‌మిది. శుక్ర‌వారం విడుద‌లైంది. తొలి రోజు మంచి వ‌సూళ్లు అందుకుంది. శ‌ని, ఆదివారాలు కూడా వ‌సూళ్లు నిల‌బ‌డ్డాయి. ఈ సినిమాకి దాదాపుగా 3 కోట్ల వ‌ర‌కూ బిజినెస్ జ‌రిగింది.

 

తొలి మూడు రోజుల్లోనే 2.5 కోట్లు రాబ‌ట్ట‌గ‌లిగింది. ఆ లెక్క‌న మ‌రో రూ.50 ల‌క్ష‌లు సంపాదిస్తే.. బ్రేక్ ఈవెన్‌లో ప‌డిపోవొచ్చు. సోమ‌వారం నుంచి కూడా వ‌సూళ్లు ఆశాజ‌న‌కంగా ఉండే అవ‌కాశం ఉంది. ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీకి మాత్ర‌మే. దానికి తోడు.. చాలా థియేట‌ర్లు తెర‌చుకోలేదు. అయినా స‌రే, ఈ స్థాయిలో వ‌సూళ్లు అందుకుందంటే గ్రేటే అనుకోవాలి. వ‌చ్చే వారం `పాగ‌ల్‌` విడుద‌ల అవుతోంది. అప్ప‌టి వ‌ర‌కూ క‌ల్యాణ‌మండ‌పం జోరు చూపించే అవ‌కాశం ఉంది. `పాగ‌ల్` కోసం ఏపీలో మ‌రిన్ని థియేట‌ర్లు తెర‌చుకునే అవ‌కాశం ఉంది. సో.. టాలీవుడ్ మ‌ళ్లీ జోరందుకునే ఛాన్సులున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS