ఇలియానా నిర్మాతగా మారబోతోందా.? తన బయోపిక్‌ని తానే రూపొందించాలనుకుంటోందా.? అంటే, అవుననే సమాధానం వినిపిస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇలియానా నిర్మాతగా మారబోతోందనీ, త్వరలోనే ఈ విషయాన్ని ఆమె వెల్లడించబోతోందనీ తెలుస్తోంది. అయితే, ఆమె నిర్మాతగా మారేది సినిమా నిర్మాణంతో కాదు.. ఓ షార్ట్ ఫిలిం నిర్మాణంతో. ఓ నటి కెరీర్ గురించిన కథాంశంతో ఇలియానా ఈ షార్ట్ ఫిలిం రూపొందించబోతోందని సమాచారం. అయితే, అందులో ఆమె నటించబోదట. ఆమెలా కనిపించే ఓ యువ నటి ఈ సినిమాలో టనించనుందని తెలుస్తోంది.
ఇలియానా తన జీవిత కథనే బయోపిక్‌గా మలచబోతోందట. అయితే, తన రిఫరెన్స్ లేకుండానే ఆ బయోపిక్ వుంటుందని సమాచారం. ఎందుకిలా.? అంటే, ఇలియానా తన జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాల్ని చూసిందనీ, అవన్నీ ఓ క్రమంలో పేర్చితో అదొక అద్భుతమైన కథలా అనిపించిందనీ, దాంతో వెంటనే బయోపిక్ ఆలోచన చేసిందనీ అంటున్నారు. అయితే, తన జీవితంలో లవ్ విషయమై తలెత్తిన కొన్ని వివాదాల కారణంగా, తన బయోపిక్.. అన్న ప్రొజెక్షన్ జరగకుండానే షార్ట్ ఫిలింని రూపొందించబోతోందట. ఆమె ఎంతలా ఆ ప్లాన్ చేసినా, ఇలియానా బయోపిక్‌ని గుర్తుపట్టలేమా.?