ఇలియానా ఇంత భయంకరమా?

మరిన్ని వార్తలు

గోవా బ్యూటీ ఇలియానా అంటే, స్టైలిష్‌ డ్రస్సింగ్‌కి కేరాఫ్‌ ఆడ్రస్‌. అలాంటిది ఈ మధ్య చెత్త డ్రస్సింగ్‌తో విసిగిస్తోందంటూ ట్రోల్స్‌ ఎదుర్కొంటోంది. అంతేకాదు, పర్‌ఫెక్ట్‌ ఫిట్‌నెస్‌కీ ఇలియానా పెట్టింది పేరు. కానీ, ఈ మధ్య ఎందుకో ఫిగర్‌ని చాలా లైట్‌ తీసుకుంటోంది. అడ్డదిడ్డంగా బరువు పెరిగి చెత్త కాంబినేషన్స్‌లో డ్రస్సింగ్‌ చేస్తూ, అదే హాట్‌నెస్‌ అంటూ భ్రమలో బతికేస్తోంది. కానీ, ఈ దర్శనాల్ని తట్టుకోలేకపోతున్నారు నెటిజన్లు.

 

ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా స్టార్‌ హీరోలందరి సరసనా తళుక్కున మెరిసిన ఇలియానాకు ఇప్పుడు అవకాశాలే రావడం లేదు. అందుకు కారణం ఆమె ఫిట్‌నెస్సే. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ సినిమాలో కనిపించింది. ఆ సినిమాలో ఇలియానా చాలా బొద్దుగా, ఎబ్బెట్టుగా కనిపించిందనే విమర్శలున్నాయి. ఇదే మాట పదే పదే నెటిజన్లు సూచిస్తున్నా అస్సలు పట్టించుకోవడమే మానేసింది.

 

ఈ మధ్య లాక్మే ఫ్యాషన్‌ షోలో ఇలియానా అందాల ప్రదర్శనను హారర్‌ మూవీతో పోల్చి నెటిజన్లు వైరల్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆఫర్స్‌ కావాలి కానీ, ఫిట్‌నెస్‌ గాలికొదిలేస్తే ఎలా బేబీ..? అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మరి బెల్లీ భామ ఎందుకిలా మారిపోయింది.? తనకన్నా సీనియర్స్‌ అయిన త్రిష, శ్రియ, నయనతార తదితర ముద్దుగుమ్మలు ఫిట్‌గా ఉండేందుకు పడుతున్న తపన చూస్తుంటే ముచ్చటేసుకొస్తోంది. కానీ ఇలియానా ఎందుకిలా ప్రవర్తిస్తోంది. మనసు పెడితే, ఎంత సేపు.. సన్న జాజి నడుము ఆమె సొంతమయ్యేందుకు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS