ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అనిపించుకున్న బెల్లీ బ్యూటీ ఇలియానా చాన్నాళ్ల తర్వాత 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అయితే ఈ సినిమాలో ఇలియానా చాలా లావుగా ఉందంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలకు ఇలియానా బాగా హర్టవుతోందట.
ఈ కామెంట్స్‌తో ఇప్పుడు ఇలియానా జిమ్‌ల చుట్టూ ప్రదక్షిణలు మొదలెట్టిందట. అయినా ఇలియానా అంటే ఫిట్‌నెస్‌కి మారుపేరు. నిన్న మొన్నటిదాకా హాట్ హాట్ సెక్సీ వీడియోలను, ఫోటోలను పోస్ట్ చేస్తూ సినిమాలు లేకపోయినా, సోషల్ మీడియాలో ఏమాత్రం క్రేజ్ తగ్గించుకోని ఇలియానా తీరా అవకాశమొచ్చేసరికి ఇలా తయారయ్యిందేంటబ్బా అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. గతంలో రవితేజతో ఇలియానా నటించిన 'కిక్' చిత్రంలో కొంచెం బొద్దుగా కనిపించింది. అయినా ఆ బొద్దుతనం అందంగానే అనిపించింది.
కానీ ఇప్పుడలా కాదు, కాస్త కష్టంగా అనిపిస్తోంది ఇలియానాని అంత లావుగా చూడాలంటే. అందుకే విమర్శలు తప్పట్లేదు. మొదట్లో ఈ విమర్శల్ని లైట్ తీసుకున్న ఇలియానా సినిమా విడుదల దగ్గరపడుతున్న కొలదీ కాస్త ఇబ్బందిగా ఫీలవుతోందట. దాంతో ఇమీడియట్‌గా వెయిట్ తగ్గించాలని నిర్ణయించుకుందట. ముందు ముందు ప్రమోషన్స్‌లో నాజూకు అందాల ఇలియానాని చూస్తారన్నట్లుగా సంకేతాలు పంపిస్తోందట.
అందుకోసం ఇలియానా సర్జరీని ఆశ్రయించే ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారమ్. ఈ నెల 16న 'అమర్ అక్బర్ ఆంటోనీ' ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకి శీను వైట్ల దర్శకుడు.