ఇలియానా పెళ్ళయిపోయిందోచ్‌

మరిన్ని వార్తలు

బెల్లీ బ్యూటీ ఇలియానా, ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ మధ్య చాలాకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. చాలా సందర్భాల్లో ఈ ఇద్దరూ కలిసి కెమెరాలకు చిక్కారు. అప్పట్లో ఈ విషయం ఇలియాని వద్ద ప్రస్థావించగా, ఆండ్రూ తనకి మంచి ఫ్రెండ్‌ మాత్రమే అంది. అయితే ఆ తర్వాత ఈ ఫ్రెండ్‌షిప్‌కి బ్రేకప్‌ చెప్పేసుకున్నారు కూడా. తర్వాత మళ్లీ కలిశారు. 

ఈ సారి కలవడం చాలా స్ట్రాంగ్‌గా కలిశారంట. కొన్నాళ్లు సహజీవనం కూడా చేశారు ఇలియానా, ఆండ్రూ. ఈ మధ్యనే సోషల్‌ మీడియాలో ఓ ఫోటో పోస్ట్‌ చేసి 'మై బెటర్‌ హాఫ్‌' అని హ్యాష్‌టాగ్‌ పెట్టింది. దాంతో 'ఇలియానాకి పెళ్లయిపోయిందా' అనే వార్తలు జోరుగా వినిపించేసరికి, వాటిని సున్నితంగా ఖండించింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు, నా పెళ్లి అంత ఇంపార్టెంట్‌ మేటరా? మీకు అని ఎదురు ప్రశ్నలు కూడా సంధించిందీ బ్యూటీ. 

అయితే తాజాగా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ ఫోటో పోస్ట్‌ చేసిందీ బెల్లీ బ్యూటీ. ఆ ఫోటోపై 'మై హబ్బీ' అని రాసుంది. హజ్‌బెండ్‌ అని రాసుందంటే, ఇలియానా, ఆండ్రూని పెళ్లి చేసుకున్నట్లే భావించాలి. తెలుగులో 'దేవదాసు' సినిమాతో పరిచయమైన బ్యూటీ ఇలియానా. తొలి సినిమాతోనే మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత 'పోకిరి, జులాయి' తదితర సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించింది. 

స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం తెలుగుకి టాటా చెప్పేసి, బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ సినిమాలతో బిజీగా ఉంది. క్రిస్‌మస్‌ సందర్భంగా ఇలియానా ఫోటోని పోస్ట్‌ చేస్తూ..ఇది నా హబ్బీ ఆండ్రూ తీసిన ఫోటో అని చెప్పింది. అంటే ఇలియానాకి పెళ్లయిపోయిందనే భావించాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS