గోవా బ్యూటీ ఇలియానా ఫ్యాషన్స్‌లో ట్రెండీని బాగా ఫాలో చేస్తుంటుంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటించి, స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది ఈ ముద్దుగుమ్మ. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఇలియానాని పట్టించుకోవడం లేదు కానీ, బాలీవుడ్‌లో అమ్మడు తిష్ట వేసుకుని కూర్చుంది. అక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టడం లేదు. కాగా సోషల్ మీడియాకి మాత్రం ఎప్పుడే టచ్‌లో ఉంటుంది. నాలో గ్లామర్ ఇంకా తగ్గలేదు అని ఎప్పటికప్పుడే ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తోంది. ఈ మధ్య స్విమ్ సూట్స్ వేసుకుని వయ్యారాలు పోయింది. తాజాగా ఇదిగో ట్రెండీ లుక్‌లో దర్శనమిచ్చింది. ట్రెండ్‌కి అమ్మడు పెట్టింది పేరేగా. అందుకే ఈ ఎల్లో కలర్ అల్ట్రా మోడ్రన్ కాస్ట్యూమ్‌లో గోల్డెన్ డక్‌లా మెరిసిపోతోంది బ్యూటీ ఇలియానా. ఓ అవార్డు ఫంక్షన్‌లో బెల్లీ బేబ్ ఇలా తళుక్కుమంది.