'అరవింద సమేత..'కు ఐటీ దెబ్బ.?

By iQlikMovies - October 05, 2018 - 12:05 PM IST

మరిన్ని వార్తలు

అరవింద సమేత మూవీ న్యూస్:-

పెద్ద సినిమాలు రిలీజవుతున్నాయంటే ఆదాయపు పన్ను శాఖ భయం ఆ చిత్ర యూనిట్‌ని వెంటాడడం సర్వ సాధారణమైపోయింది. 'బాహుబలి' రిలీజ్‌ టైంలో ఆ సినిమా నిర్మాణ సంస్థపై ఐటీ దాడులు జరిగాయి. అంతకు ముందు, ఆ తర్వాత కూడా చాలా సినిమాలకు ఐటీ టెన్షన్‌ పెద్ద తలనొప్పిగా మారిన సందర్భాలున్నాయి. అయితే మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న 'అరవింద సమేత..' టీమ్‌ ఇప్పుడు ఈ ఐటీ టెన్షన్‌ని ఎదుర్కోవాల్సి వస్తోంది.

దాదాపు ఈ టెన్షన్‌ అరవింద సమేతకు తప్పేలా లేదనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను శాక ప్రస్తుతం వరుస దాడులు నిర్వహిస్తోంది. ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపార సంస్థలు ఐటీ దాడుల దెబ్బకు హడలెత్తిపోతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో విడుదల కానున్న 'అరవింద సమేత..' చిత్ర యూనిట్‌ని ఇప్పుడీ భయం తీవ్రంగా వెంటాడుతోంది. హారికా హాసినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రాధాకృష్ణ నిర్మించారు.

ఇక సినిమా విషయానికి వస్తే ఎన్టీఆర్‌ హీరోగా పూజా హెగ్దే హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ చిత్రం రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో రూపొందింది. చిత్తూరు కుర్రోడిగా రాయలసీమ యాసలో ఎన్టీఆర్‌ డైలాగులు ఆకట్టుకోనున్నాయి. ఆల్రెడీ ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. కమెడియన్‌ కమ్‌ హీరో సునీల్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో తెలుగమ్మాయ్‌ ఈషారెబ్బా మరో ఇంపార్టెంట్‌ రోల్‌లో నటిస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తొలిసారి ఎన్టీఆర్‌ నటిస్తున్న చిత్రమిది. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS