మహేష్ కోసం ఫారెన్ బ్యూటీ

మరిన్ని వార్తలు

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభము కానుంది. ఇంకా హీరోయిన్ విషయంలో క్లారిటీ లేదని, ప్రియాంక , దీపికా, పేర్లు వినిపిస్తున్నాయి అని ఫాన్స్ అయోమయంలో ఉన్నారు. అయితే ఈ మూవీ హీరోయిన్ గూర్చి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. మహేష్ కోసం హీరోయిన్ ఫైనలయ్యింది అని, ఈ బ్యూటీ పేరు చెల్సియా ఇస్లాన్ అని సమాచారం. ఈమెది ఇండోనేషియా. RRR హీరోయిన్ ను మించిన అందగత్తె అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మహేష్ చెల్సియా జోడీ పర్ఫెక్ట్ గా ఉంటుందని ఫాన్స్ సంబరపడుతున్నారు.


చెల్సియా కొన్ని హాలీవుడ్ మూవీస్ లో కూడా యాక్ట్ చేసింది. ఇటీవ‌ల ఆమెను స్క్రీన్ టెస్ట్ కూడా చేశార‌ని, ఈ సినిమాలో ఆమె రాక దాదాపు ఖాయ‌మ‌ని తెలుస్తోంది. 1500 కోట్ల రూపాయల ఖర్చుతో హాలీవుడ్ లెవెల్ లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారని 2026లో ఈ సినిమా రిలీజయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇండియానా జోన్స్ తరహాలో ఈ చిత్రం తెరకెక్కనుండగా, ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విదేశీ లొకేషన్లకు సంబంధించిన సీన్లను గ్రీన్ మ్యాట్ లో షూట్ చేస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS