కె.రాఘవేంద్రరావు - నాగార్జుల నుంచి వచ్చిన క్లాసిక్.. అన్నమయ్య. ఈ సినిమా తరవాత... నాగ్ సినీ జీవితం మరో మలుపు తిరిగింది. ఆధ్యాత్మిక, భక్తి చిత్రాలు తీస్తే చూడ్డానికి ప్రేక్షకులు సదా సిద్ధంగా ఉన్నారన్న విషయం అర్థమైంది. ఆ తరవాత వీరిద్దరి నుంచి ఎన్ని సినిమాలొచ్చినా.. అన్నమయ్య లాండ్ మార్క్‌ని దాటలేకపోయాయి. మరీ ముఖ్యంగా అన్నమయ్య క్లైమాక్స్ గురించి సీనీ జనాలు ఇప్పటికీ మాట్లాడుకొంటూనే ఉంటారు. ఓం నమో వేంకటేశాయలో కూడా అంతకు మించిన క్లైమాక్స్ ఉండబోతోందని టాక్. క్లైమాక్స్ లో ఫీల్ ఉంటేనే ఈ సినిమా చేస్తా.. అంటూ నాగ్ ముందే రాఘవేంద్రరావుకి చెప్పేశాడట. దానికి తగ్గట్టుగానే భారవి, రాఘవేంద్రరావులు కలసి ఓ అద్భుతమైన క్లైమాక్స్‌ని డిజైన్ చేశారని, అది ఈ సినిమాకే హైలెట్ అవుతుందని తెలుస్తోంది. నాగ్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. ''అన్నమయ్య క్లైమాక్స్‌ని మించిన దృశ్యాలు ఈ సినిమాలో కనిపిస్తాయి'' అనేశాడు. సో ఫ్యాన్స్... గెట్ రెడీ!