రారండోయ్ వేడుక చూద్దాం కలెక్షన్స్ పెరుగుతున్న దశలో విడుదలైన ఈ వారం చిత్రాలు ఎంతవరకు ప్రేక్షకులని మెప్పించి బాక్స్ ఆఫీస్ వద్ద తమ ప్రతాపం చూపించాయి అనేది తెలుసుకుందాం.
మొదట సీనియర్ డైరెక్టర్ అయిన వంశీ నుండి చాలా కాలం తరువాత వచ్చిన ఫ్యాషన్ డిజైనర్ సన్ అఫ్ లేడీస్ టైలర్ ప్రేక్షకులని నిరాశ పరిచిందనే చెప్పాలి. ఆయన మార్కు కామెడీ టైమింగ్ కి ఇప్పటి ప్రేక్షకులు కనెక్ట్ కాకపోవడం మేజర్ మైనస్ అనే భావన వ్యక్తంచేశారు.
ఆయన మాత్రం తన ట్రేడ్మార్క్ గోదావరి అందాలు చూపెట్టినా ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రాన్ని సున్నితంగా తిరస్కరించినట్టు థియేటర్ల వద్ద నుండి రిపోర్ట్.
ఇక యంగ్ హీరో రాజ్ తరుణ్ అంధగాడు చిత్రం మాత్రం ఈ రేసులో విజేతగా నిలిచింది అని చెప్పొచ్చు. వస్తున్న రిపోర్ట్స్, టాక్ బట్టి ఈ చిత్రం యావరేజ్ గా ఉందని అలాగే రైటర్ నుండి డైరెక్టర్ గా మారిన వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడిగా ఒక 70శాతం సక్సెస్ అయ్యాడని సమాచారం.
సినిమా జయాపజయాల తో సంబంధం లేకుండా చిత్రాలని విడుదల చేస్తున్న రాజ్ తరుణ్ కి ఇది మంచి రిజల్ట్ వచ్చిన చిత్రం అనే చెప్పాలి.
సో.. ఈ వారం ఐక్లిక్ మూవీస్ టాక్ అఫ్ ది వీక్ గా రాజ్ తరుణ్ అంధగాడు నిలిచింది.