మహానటి హద్దులు దాటనుందా?

మరిన్ని వార్తలు

మహానటి సినిమాతో కీర్తి సురేష్ కీర్తి ప్రతిష్ఠలు పెరిగాయి. అప్పటివరకు తమిళం, మలయాళం, తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు మహానటి తో వచ్చింది. క్రిటిక్స్ ప్రశంసలతో పాటు. నేషనల్ అవార్డు కూడా దక్కించుకుంది కీర్తి సురేష్. మహానటి తరవాత టాలీవుడ్ , కోలీవుడ్, మాలీ వుడ్ లలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. సూపర్ స్టార్స్ తో ఛాన్సెస్ తో పాటు లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ, స్టార్ హీరోయిన్గా వెలుగుతోంది. బాలీవుడ్ లో కూడా వరుణ్ ధావన్ తో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కీర్తి ఎన్ని సినిమాలు చేసినా పద్దతిగానే కనిపిస్తుంది. ఎక్కువగా ట్రెడిషనల్ వేర్ లో కనిపించి మెప్పిస్తుంది. తనకంటూ కొన్ని హద్దులు పెట్టుకుని, సినిమాలు ఒప్పుకుంటూ  హాయిగా తన కెరియర్ సాగిస్తోంది.
               

ప్రజంట్ ఉన్న పోటీ ప్రపంచం లో అది సాధ్య మవుతుందా? ఎక్కువ కాలం నిలదొక్కుకోవాలంటే, అవకాశాలు రావాలంటే కొన్నిటికి తల ఒగ్గక తప్పదేమో. ఇప్పుడు  అలాంటి పరిస్థితే వచ్చింది కీర్తికి. ఒకప్పుడు  సినిమాల్లో  లిప్ లాక్ సన్నివేశాలు అంటే కేవలం హాలీవుడ్ , బాలీవుడ్ లో మాత్రమే ఉండేవి. సౌత్ హీరోయిన్స్ ఇలాంటి వాటికి ఒప్పుకోరని నార్త్ భామలకు ఓటు వేసేవారు, మన హీరోలు, దర్శకులు. కానీ ఇప్పుడు అన్ని సినిమాల్లో లిప్ లాక్ లు కామన్ అయిపోయాయి. ఒకటి రెండు కాదు డజన్ల కొద్దీ పెడుతున్నారు ఇలాంటి ముద్దు సీన్స్.  ఇవి ఎంత ఎక్కువుంటే అంత హిట్ అనే స్థాయికి నేటి సినిమా మారిపోయింది. ఇప్పటి  హీరో హీరోయిన్స్ కూడా ఇలాంటివి చేయటానికి వెనక్కాడం లేదు.
 

ఇప్పుడు హీరోయిన్ కీర్తి సురేష్ కి ఇలాంటి ఆఫర్ వచ్చిందని టాక్. టాలీవుడ్ లో ఒక ప్రముఖ హీరో ఈమెతో లిప్ లాక్ సన్నివేశాలు డిమాండ్ చేస్తున్నాడని, అందుకోసం కీర్తి సురేష్ కి కొన్ని కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యారని సమాచారం. ప్రజంట్ ఈ న్యూస్  సోషల్ మీడియాలో తెగ  వైరల్ అవుతోంది. ఈ భారీ అఫర్ కోసం కీర్తి హద్దులు దాటుతుందా లేదో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS