ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది సమంత. నాగార్జున గైర్హాజరీతో హోస్ట్‌గా అడుగుపెట్టిన సమంత.. తొలి ఎపిసోడ్ తోనే అందరినీ ఆకట్టుకుంది. సమంత కి తెలుగు అంతత మాత్రమే వచ్చు. బిగ్ బాస్ ఎలా నడుస్తుంది? అంతకు ముందు ఏయేఎపిసోడ్లలో ఏం జరిగింది? కంటెస్టెంట్ల బలం ఏమిటి? బలహీనత ఏమిటి? అనేవేవీ సమంతకు అంతగా తెలీవు. అయినా సరే, ఈ షోని సమర్థవంతంగా నడిపించింది. అన్నీ తెలిసినట్టే ప్రవర్తించింది. కంటెస్టెంట్ల మనసుల్ని గెలుచుకుంది. ప్రేక్షకులకూ చక్కటి వినోదం పంచిపెట్టింది.
సమంత దెబ్బకు బిగ్ బాస్‌కి మంచి రేటింగులు వచ్చాయి. బిగ్ బాస్ 4 సీజన్ కర్టెన్ రేజర్ తరవాత.. ఆ స్థాయిలో ఈ ఎపిసోడ్ సక్సెస్ అయ్యింది. బిగ్ బాస్ అభిమానులు చాలామంది.. నాగార్జున కంటే.. సమంత యాంకరింగే బాగుందని, ఈ షోకి కొత్త కలరింగు వచ్చిందని చెబుతున్నారు. రేటింగులూ అలానే ఉన్నాయి. ఈ సీజన్‌లో అంతగా మెరుపులు లేని మాట వాస్తవం. బిగ్ బాస్ పై మోజు, ఆసక్తి బాగా తగ్గిపోతోంది. దానికి తోడు ఐపీఎల్ వల్ల.. బిగ్ బాస్‌కి రేటింగులు లేకుండా పోయాయి. ఇలాంటి దశలో సమంత ఎంట్రీ ఇచ్చి.. మళ్లీ ఈ షోకి జీవం పోసినట్టైంది.