నటి, నిర్మాణ సంస్థ యజమాని అయిన రాధిక శరత్ కుమార్ ఇంటి, ఆఫీస్ పైన ఒకే సమయంలో ఐటీ శాఖకు చెందిన అధికారులు దాడులు చేశారు.
నిన్ననే రాధిక భర్త శరత్ కుమార్ ఆఫీస్ పైన దాడులు చేసిన తరువాత ఈ రోజు రాధిక స్వంత సంస్థ అయిన రాడాన్ ప్రైవేటు లిమిటెడ్ పైన మెరుపు దాడులు జరగడం చర్చనీయాంశం అయ్యింది. దీనంతటికి కారణం, ఆర్కే నగర్ ఉప ఎన్నిక సంబంధించి డబ్బు పంపిణి జరిగింది అని తేలడం అలాగే దానికి శరత్ కుమార్ కి పాత్ర ఉందన్న అనుమానాలే!
ఇదే సమయంలో చెన్నైలోని మరికొంతమంది ప్రముఖుల ఇళ్ళ పైన ఈ రోజు ఐటీ దాడులు జరిగాయి.