బుల్లితెరపై ప్రసారమయ్యే ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్ ‘జబర్దస్త్’ నుండి నవ్వుల నవాబు నాగబాబు వేరు పడ్డాకా, మరో ఛానెల్‌లో ‘అదిరింది’ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ‘జబర్దస్త్’కి హండ్రెడ్ పర్సంట్ పోటీగా స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రామ్ మొదట్లో అంతగా క్లిక్ అవ్వలేదు. జబర్దస్త్ యాంకర్స్‌గా అనసూయ, రష్మి వీర లెవల్ గ్లామర్ అప్పియరెన్స్ ‘జబర్దస్త్’కి మెయిన్ అస్సెట్ కాగా, ‘అదిరింది’ ఆ విషయంలో పూర్తిగా విఫలమైంది. బుల్లితెర నటి సమీరాని యాంకర్‌గా ఎంపిక చేసుకోవడంలో షో ఫెయిల్యూర్కి అదో కారణమైంది. ఇక ఇప్పుడు పరిస్థితులు మారాయి.
అదిరింది’ పొలంలో మొలకలొచ్చాయి. యాంకర్ మారింది. సమీరా ప్లేస్‌లో భానుశ్రీ వచ్చి చేరింది. భానుతో పాటు, రొమాంటిక్ యాంకర్ రవి కూడా యాడ్ అవ్వడంతో సరికొత్త గ్లామర్ దక్కించుకుంది ‘అదిరింది’. విజువల్ క్వాలిటీ పరంగానూ మొదట్లో కొన్ని కంప్లయింట్స్ ఉన్నాయి. అవి కూడా దాదాపు ఇప్పుడు కవర్ అయిపోయాయ్. ఇక సౌండ్ సిస్టమ్ విషయంలో చిన్నా చితకా మైనస్‌లున్నాయి. కానీ, త్వరలోనే అవి కూడా కవర్ అయిపోతాయంటున్నారు. నాగబాబు, నవదీప్. భానుశ్రీ గ్లామర్, రవి యాంకరింగ్ టాలెంట్, కంటెస్టెంట్స్ కొత్త కొత్త స్కిట్ థాట్స్.. అన్నీ వెరసి, ‘అదిరింది’ ప్రోగ్రామ్ తన టార్గెట్‌ని రీచ్ అయ్యే టైమ్ త్వరలోనే ఉందనిపిస్తోంది.