'తేజాబ్' సినిమాలోని పాట ఇది. మాధురి దీక్షిత్ నటించిన ఈ పాట అప్పటల్లో దేశాన్ని ఓ ఊపు ఊపేసింది. ఇదే పాటని తెలుగులో వెంకటేష్ హీరోగా వచ్చిన 'టూ టౌన్ రౌడీ' సినిమాలో రీమిక్స్ చేశారు. ఇందులో రాధ నటించింది. రాధ కూడా ఈ పాటకి డాన్స్ ఇరగదీసేసింది. రాధ అంటే డాన్సింగ్ క్వీన్. మాధురి దీక్షిత్ అందానికి, డాన్స్‌కి రాధ కూడా తనదైన టాలెంట్‌తో న్యాయం చేసింది.
తాజాగా 'బాఘీ 2' కోసం ఈ పాటని మళ్లీ రీమిక్స్ చేశారు. జాక్వెలైన్ ఫెర్నాండెజ్ ఈ సాంగ్‌లో నటించింది. తాజాగా ఈ సాంగ్ టీజర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. పూర్తి సాంగ్ కాదు కానీ, జస్ట్ టీజర్‌నే వదిలారు. అయితే అస్సలు ఇంప్రెస్ చేయలేదు, సరికదా, ఈ పాటకు డాన్స్ చేసిన జాక్వెలైన్‌ని పరువు తీసేసిందని కామెంట్స్‌తో ఏకి పారేస్తున్నారు జనం.
ఈ పాట కోసం ముందే జాకీ చాలా గొప్పలు చెప్పుకొచ్చింది. ఈ పాట కోసం చాలా కష్టపడ్డాం. చాలా జాగ్రత్తలు తీసుకున్నాం, మాధురి దీక్షిత్ చేసిన డాన్సు స్టెప్పులు కాపీ చేయలేదు ఎందుకంటే ఆమె గొప్ప డాన్సర్. ఆమెతో మ్యాచ్ చేయలేమనే ఉద్దేశ్యంతోనే, ఆ పాట ఫ్లేవర్ చెడిపోకుండా తగిన జాగ్రత్తలు చాలా తీసుకుని ఈ సాంగ్‌ని షూట్ చేశాం.. అని జాక్వెలైన్ చెప్పింది.
కానీ తాజాగా వచ్చిన ఈ టీజర్ చూశాక, ఫ్లేవర్ కాదు కదా ఆ పాట పరువు తీసేసింది జాకీ అని సోషల్ మీడియాలో కామెంట్స్ గుప్పిస్తున్నారు నెటిజన్లు. టైగర్ ష్రాఫ్, దిశా పటానీ జంటగా ఈ 'బాఘీ 2' తెరకెక్కుతోంది.