ఎవ్వర్ గ్రీన్ ‘అతిలోక సుందరి’ ని మ్యాచ్ చేసేదెవరు.?

మరిన్ని వార్తలు

‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా వచ్చి ముప్పయి ఏళ్లు గడుస్తున్నా ఆ సినిమాలోని ఫ్రెష్ నెస్ అలాగే ఉండడం ఆ సినిమా గొప్పతనం. లేటెస్ట్గ్ గా ఈ సినిమా బుల్లితెరపై ప్రసారమైంది. చాలా సార్లు గతంలో ఈ సినిమా టెలికాస్ట్ అయినా, తాజాగా మరోసారి ప్రేక్షకులు ఈ సినిమాని ఆసక్తిగా వీక్షించారు. దివంగత తార శ్రీదేవినీ, ఆమె అపురూపమైన ముగ్ధ మనోహర సౌందర్యాన్నీ గుర్తు చేసుకున్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరపై చూపించిన విజువల్ మ్యాజిక్ ని ప్రేక్షకులు సరికొత్తగా ఆస్వాదించారు.

 

అశ్వనీదత్ నిర్మాణపు విలువల్ని మననం చేసుకున్నారు. ఇక ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించబోతున్నారంటూ ఈ మధ్య ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. నిర్మాత అశ్వనీదత్ ఈ సినిమాని రూపొందించేందుకు తెర వెనుక ఏర్పాట్లు చేస్తున్నట్టుగానూ టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ అద్భుత కళా ఖండాన్ని ఈ జనరేషన్ మెచ్చుకునేలా తెరకెక్కించగల ఆ గొప్ప దర్శకుడెవరు.? మెగాస్టార్ చిరంజీవిలా జగదేక వీరుడిగా మెప్పించే హీరో ఎవరు.? అతిలోక సుందరి పాత్రకు శ్రీదేవిలా ప్రాణం పోయగల సత్తా ఉన్న నటి ఎవరు.? అని చాలా చాలా ప్రశ్నలు ప్రేక్షకుల్లో మెదులుతున్నాయ్. వాటన్నింటికీ సమాధానం రావాలంటే, కొంత సమయం వేచి చూడాలి తప్పదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS