మహేష్‌ ప్రాజెక్ట్‌ వాక్‌ అవుట్‌పై జగపతిబాబు స్పందన!

By iQlikMovies - July 19, 2019 - 17:00 PM IST

మరిన్ని వార్తలు

'సరిలేరు నీకెవ్వరు' ప్రాజెక్ట్‌ నుండి జగపతిబాబు తప్పుకున్నారు అనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఈ విషయమై తాజాగా జగపతిబాబు సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. 'ప్రచారం జరుగుతున్నట్లు, ఈ సినిమా నుండి నేను తప్పుకున్నాను అన్న వార్తలో నిజం లేదు. కానీ, ఇండస్ట్రీలో కొన్ని కొన్ని అలా జరుగుతుంటాయి అంతే. కొన్ని సందర్భాల్లో అలాంటి వాటి విషయంలో ఏం చేయలేం.

 

కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టులో నేను లేను. కానీ, ఈ క్యారెక్టర్‌ని నేనెంతో ఇష్టపడి ఒప్పుకున్నాను. ఈ క్యారెక్టర్‌ కోసం రెండు, మూడు మంచి సినిమాల్లో ఛాన్సులు వదిలేసుకున్నాను.. ఇప్పటికీ ఆ క్యారెక్టర్‌లో నటించేందుకు నేను సిద్ధమే..' అని జగపతిబాబు చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. జగపతిబాబును కావాలనే ఈ సినిమా నుండి తప్పించారేమో అన్న అనుమానానికి బలం చేకూరేలా ఉంది ఆయన మాటల్లోని ఆవేదన వింటుంటే.

 

అయినా ఓ స్టార్‌ ఆర్టిస్ట్‌కి ఇలా జరగడమనేది నిజంగా బాధాకరమే. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రష్మికా మందన్నా మహేష్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్‌ నటి విజయశాంతి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్‌ తొలిసారి ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నారు ఈ సినిమాలో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS