రణబీర్ కపూర్-కత్రినా కైఫ్ ల మధ్య కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే.
అయితే వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ బ్రేక్ అప్ తరువాత కలిసి నటించబోతున్న జగ్గా జాసూస్ చిత్రం రిలీజ్ కి సిద్ధం అయింది. కొద్దిసేపటి క్రితమే, జగ్గా జాసూస్ యూనిట్ ఈ చిత్రన్నీ జూలై 14వ తేదిన విడుదల చేస్తున్నామని ప్రకటించారు.
ఇప్పటికే రణబీర్-కత్రీనా మధ్య వచ్చే సీన్స్ ఎలా ఉండబోతున్నాయి అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇక డైరెక్టర్ అనురాగ్ బసు కూడా ఈ చిత్రం గురించి ఏవిధమైన లీక్స్ జరగకుండా జాగ్రతలు తీసుకున్నారు. చూద్దాం మరి వీరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో!