ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన హనుమాన్ మూవీతో బిగ్గెస్ట్ హిట్ అందుకుని పాన్ ఇండియా దర్శకుడు అయిపోయాడు ప్రశాంత్ వర్మ. ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు ఇందులో హీరోగా నటించిన తేజా సజ్జా. చిన్న సినిమాగా వచ్చి భారీ హిట్ అందుకుని, వసూళ్లు కూడా బాగా రాబట్టింది. హనుమాన్ తో మొదటి పాన్ ఇండియా హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మ దీనికి సీక్వెల్ గా జై హనుమాన్ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఒక వైపు బాలయ్య కొడుకు మోక్షజ్ఞతో ఒక సినిమా మొదలు పెట్టాడు. ఇంకో వైపు జై హనుమాన్ కూడా అనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసాడు.
జై హనుమాన్ లో కాంతారా ఫేమ్ నేషనల్ స్టార్ 'రిషబ్ శెట్టి' హనుమంతుడి పాత్రలో కనిపించబోతున్నాడని అనౌన్స్ చేయటమే కాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసాడు. రిషబ్ శెట్టి లాంటి పాన్ ఇండియా స్టార్ జై హనుమాన్ లో హనుమంతుడిగా నటిస్తున్నాడని తెలియటంతో ఈ ప్రాజెక్ట్ కి ఇంకొంచెం హైపు పెరిగింది. జై హనుమాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన మరసటి రోజే థీమ్ సాంగ్ కూడా రిలీజ్ చేసి ఆడియన్స్ కి సర్ప్రయిజ్ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. యుగయుగముల యోగవిధి దాశరథి అంటూ సాగే సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రశాంత్ చాలా జోరుగా ఉన్నాడని, సినిమా కూడా తొందరగానే కంప్లీట్ చేస్తాడని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
అయితే హనుమంతుడు ఓకే ఇంతకీ దాశరథీ ఎవరు? అన్న చర్చలు కూడా నడుస్తున్నాయి. హనుమంతుడి పాత్ర కోసం పాన్ ఇండియా స్టార్ ని తెచ్చినప్పుడు రాముడి పాత్ర కోసం ఏ హీరోని రంగంలోకి దింపుతారని ఆసక్తి మొదలైంది. లేదా మొదటి పార్ట్ లో హనుమంతుడిని యానిమేషన్ లో చూపించినట్లు జై హనుమాన్ లో రాముడ్ని యానిమేషన్ లో చూపిస్తారా? అన్న సందేహాలు కూడా వస్తున్నాయి. కల్కిలో కూడా కృష్ణుడి పాత్రని యానిమేషన్ లో చూపించారు. పార్ట్ 2 లో కృష్ణుడి పాత్రని రివీల్ చేస్తారని టాక్. హనుమాన్ లో ఆంజనేయుడిని యానిమేషన్ లో చూపించి, జై హనుమాన్ లో ఆ పాత్ర కోసం స్టార్ హీరోని దింపారు, ఇప్పుడు రాముడ్ని కూడా యానిమేషన్ లో చూపించి నెక్స్ట్ పార్ట్ లో రాముడు మెయిన్ లీడ్ గా చేసుకుంటారా? అన్నది చూడాలి.