లైంగిక వేధింపుల కేసులపై ఫిలిం ఛాంబర్ రియాక్షన్ ఇదే

మరిన్ని వార్తలు

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు ఫైల్ అయిన సంగతి తెలిసిందే. జానీ దగ్గర అసిస్టెంట్ గా చేస్తున్న లేడి కొరియోగ్రాఫర్ రాయదుర్గం పోలీసులకి కంప్లైన్ట్ చేసింది. ఆ కంప్లైన్ట్ లో 2019 నుంచి జానీ తనని లైంగికంగా వేధిస్తున్నాడని, అవుట్ డోర్ షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు, కార్ వ్యాన్ లోనూ, తన ఇంట్లోనూ పలు మార్లు అత్యచారం చేసాడని, తన కెరియర్ ని కూడా దెబ్బతీస్తున్నారని పిర్యాదు చేసింది. రీసెంట్ గా ఇదే నీ చివరి షూటింగ్ అని బెదిరింపు పార్శిల్ రావటంతో తాను బయటికి వచ్చి కంప్లైన్ట్ చేసి నట్లు పేర్కొంది.                  


ఈ విషయాలు వెలుగులోకి రావటంతో జానీని జనసేన పార్టీ కార్యక్రమాల నుంచి దూరం పెడుతూ అనౌన్స్ మెంట్ చేసింది. కొరియోగ్రాఫ‌ర్ అసోసియేష‌న్ కూడా అత్యవసర మీటింగ్ పెట్టి దీనిపై జానీ స్పందన కోరారు. ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్  కూడా రంగంలోకి దిగింది. ఈ మధ్యనే కేరళలో జస్టీస్ హేమ కమిటీ నివ్వెరపోయే నిజాల్ని వెలికి తీసింది. అన్ని ఇండస్ట్రీలకి ఇలాంటి కమిటీలుండాలని డిమాండ్స్ కూడా వచ్చాయి. ఇలాంటి టైం లో జానీ పై లైంగిక వేధింపులు నమోదు అవటం విషయం సీరియస్ అయ్యింది. వెంటనే అంతా స్పందిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో 2018లో  లైంగిక వేధింపుల ఫిర్యాదుల కోసం ఒక ప్యానెల్‌ ఏర్పాటు చేసారు.  


ఇప్పుడు ఫిలిం ఛాంబర్ గౌరవ కార్యదర్శి కేఎల్‌ దామోదర్‌ ప్రసాద్‌ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మహిళా కొరియో గ్రాఫర్ కంప్లైన్ట్ ఫిలిం చాంబర్ కి వచ్చిందని, దీనిపై విచారణ చేస్తున్నామని, ఈ కేసుని  ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్‌కు సిఫార్సు చేసిట్లు తెలిపారు. కమిటీ భేటీ అయ్యి POSH చట్టం 2013 రూల్స్ ప్రకారం ఏంక్వైరీ చేస్తామని తెలిపారు. బాధితురాలు పోలీసు కేసు పెట్టినట్లు తెలిసిందని, సోషల్ మీడియాలోను, టీవీల్లోనూ ఆ బాధితురాలి ఫోటోలను, వీడియోలను ఎవరూ వాడొద్దని రిక్వెస్ట్ చేశారు. తెలుగు ఫిల్మ్ & టీవీ డ్యాన్సర్స్ & డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో జానీ పై వచ్చిన ఈ ఫిర్యాదును  పరిష్కరించడానికి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో జానీని యూనియన్‌లో ప్రెసిడెంట్ గా ప్రస్తుతం సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.  


ఈ ప్యానెల్ లో  K.L. దామోదర్ ప్రసాద్, Hon. సెక్రటరీ & కన్వీనర్ గా ఉన్నారు. ఝాన్సీ, చైర్‌పర్సన్ గా, మిగతావారిలో సినిమా పరిశ్రమకి చెందిన వాళ్ళు తమ్మారెడ్డి భరద్వాజ, సుచిత్రా చంద్రబోస్, వివేక్ కూచిభొట్ల, ప్రగతి మహావాది. బయట వారిలో సామాజిక కార్యకర్త, మీడియా నిపుణురాలు అయిన రామలక్షి మేడపాటి, లాయర్ POSH నిపుణురాలు అయిన  కావ్య మండవ, ఉన్నారని తెలిపి, ఏదైనా లైంగిక వేధింపుల విషయంలో లేడీస్ కంప్లైన్ట్ చేయాలనుకుంటే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను సంప్రదించమని, బయట ఫిర్యాదుల కోసం బాక్స్ కూడా ఉంచి నట్లు పేర్కొన్నారు. ప్రొద్దుట 6 నుంచి రాత్రి 8 వరకు యాక్సెస్ చేసుకోవచ్చని తెలిపారు.  ఒక వేళ పోస్ట్ లో పిర్యాదులు పంపాలనుకుంటే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, డా. డి. రామానాయుడు బిల్డింగ్ కాంప్లెక్స్, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, హైదరాబాద్-500 096. అడ్రస్ ఇచ్చారు. ఫోన్ నంబర్ 9849972280, ఈమెయిల్ ఐడీ: complaints@telugufilmchamber.ఇన్ కూడా ప్రొవైడ్ చేసారు. ఇక నైనా మహిళలు దైర్యంగా బయటికి వచ్చి కంప్లైన్ట్ చేస్తారేమో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS