నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి నటించిన చిత్రం జాతిరత్నాలు. ప్రముఖ దర్శకుడు నాగ అశ్విన్ నిర్మాత. గురువారం విడుదలైన ఈ సినిమా.. తొలి రోజే హిట్ టాక్ సంపాదించింది. మిగిలిన రెండు సినిమాలతో పోలిస్తే... ఈ సినిమాకే భారీ వసూళ్లు వచ్చాయి.
తొలి రోజు బాక్సాఫీసు దగ్గర హల్ చల్ చేసిన జాతి రత్నాలు, రెండో రోజూ తన జోరచు చూపించింది. రెండు రోజులకూ కలిపి ప్రపంచ వ్యాప్తంగా 9.2 కోట్ల వసూళ్లు సంపాదించింది. ఓ చిన్న సినిమాకి ఈ స్థాయి వసూళ్లు దక్కడం విశేషమే అనుకోవాలి. రెండు రోజుల్లోనే బయ్యర్లు 80 శాతం రాబట్టుకోగలిగారు. శనివారంతో.. బ్రేక్ ఈవెన్ అయి, ఆది వారం నుంచి లాభాల బాట పట్టే అవకాశం ఉంది.
జాతి రత్నాలు 2 రోజుల వసూళ్లు
నైజాం - 3.41 కోట్లు
సీడెడ్ - 92.5 లక్షలు
నెల్లూరు - 18.8 లక్షలు
కృష్ణ - 45.2 లక్షలు
గుంటూరు - 62.3 లక్షలు
వైజాగ్ - 96 లక్షలు
ఈస్ట్ - 47.7 లక్షలు
వెస్ట్ - 43.8 లక్షలు
రెస్టాఫ్ ఇండియా - 30 లక్షలు
ఓవర్సీస్ - 1.55 కోట్లు
వరల్డ్ వైడ్ 2 డేస్ వసూళ్లు - 9.32 కోట్లు (షేర్)