సహజనటి జయసుధ తన భర్త ఆకస్మిక మరణం తరువాత తొలిసారిగా ఆ విషయం పైన స్పందించింది.
వివరాల్లోకి వెళితే, జయసుధ తన ట్విట్టర్ ద్వారా నేటితో నితిన్ కపూర్ కి తనకి పెళ్లి జరిగే 32 ఏండ్లు అయింది అని గుర్తు చేసుకుంది. అలాగే తన భర్త ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపింది.
ఇక తనకు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి తన కృతజ్ఞతలు చెప్పింది. ఈ ట్వీట్స్ చూస్తుంటే, ఇప్పుడు ఉన్న పరిస్థితుల నుండి జయసుధ మెల్లమెల్లగా కోలుకుంటున్నట్టుంది.