మళ్ళీ షూటింగ్ కి జాన్వీ కపూర్

మరిన్ని వార్తలు

శ్రీదేవి అకాలమరణంతో కుదేలైన ఆమె కుటుంబసభ్యులు మెల్లమెల్లగా కోలుకుంటున్నారు. ఈమధ్యనే ఆమె చితాబస్మాన్ని రామేశ్వరం, హరిద్వార్ లలోని పవిత్ర నదులలో కలిపారు. 

ఇక శ్రీదేవి మొదటి కూతురు జాన్వీ కపూర్ నటిస్తున్న దడక్ చిత్రం షూటింగ్ కి శ్రీదేవి మృతి కారణంగా వాయిదాపడింది. అయితే మళ్ళీ ఈరోజు నుండే షూటింగ్ పునఃప్రారంభం అయింది. దీనికి సంబంధించి ఒక షూటింగ్ స్టిల్ కూడా బయటకివచ్చింది. 

ఆ స్టిల్ లో జాన్వీ కపూర్ చీర కట్టుకుని ఉన్న ఫోటో ఉంది. ఈ ఫోటో చూస్తుంటే అచ్చంగా శ్రీదేవిని చూస్తున్నట్టుగానే ఉండడం గమనార్హం. జాన్వీ లో శ్రీదేవి పోలికలు ఉన్నాయి అని అందరికి తెలిసిందే అయితే అచ్చంగా చీర కట్టుకుంటే సరిగ్గా శ్రీదేవి లాగే ఆమె ఉండడంతో శ్రీదేవిని మళ్ళీ జాన్వీలో చూసుకోవచ్చు అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి.

కనీసం ఇలా అయిన శ్రీదేవి మనమధ్యలోనే ఉంది అని అనుకోవచ్చు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS