ఒక్క వీడియోతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది ప్రియా ప్రకాష్ వారియర్. సోషల్ మీడియాలో ఈ అమ్మడికి పిచ్చ ఫాలోయింగ్ వచ్చేసింది. కన్ను గీటి, లవర్‌కి గాలమేసిన ఈ ముద్దుగుమ్మ పేరు తెగ మార్మోగిపోయింది. యూత్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రియా ప్రకాష్ వారియర్. ఈ సంగతిటుంచితే, ఇప్పుడు వైరల్‌గా మారిన మరో వ్యక్తిని పరిచయం చేయాల్సిన అవసరం ఉంది.
ఆమె పేరే జిలూ జోసెఫ్. ఇంతకీ ఈమె చేసిందేంటంటే, ఓ మ్యాగ్జైన్ కవర్‌పేజ్‌పై తన బ్రెస్ట్‌ని ఎక్స్పోజ్ చేస్తూ పోజిచ్చింది. ఇందులో ఏమంత విచిత్రం అనుకుంటున్నారా? కానీ చిత్రమే. ఈమె ఏదో ఎక్స్పోజింగ్ చేసేందుకు ఇలా చేయలేదు. పుట్టబోయే పిల్లలకు తల్లి పాల ప్రాధాన్యతను తెలియచెబుతూ ఈ పోజిచ్చింది. అందుకే ఓన్లీ బ్రెస్ట్ ప్రమోషన్ కాదండోయ్. బిడ్డకు పాలిస్తున్నట్లుగా ఆమె ఫోటోకి పోజిచ్చిందన్న మాట. ఇటీవలి కాలంలో పిల్లలకు పాలిస్తే, అందం తరిగిపోతుంది అని, చాలా మంది తల్లులు తమ పిల్లలకు పాలివ్వడం లేదు.
కానీ తల్లి ఆరోగ్యంగా ఉండాలన్నా, బిడ్డకు ఇమ్యూనిటీ పెరగాలన్నా, తల్లి పాలే మొదటి ఔషధం అని గ్రహించాలి. ఆ అవేర్నెస్ పెంచేందుకే జిలూ జోసెఫ్ ఇలా ప్రమోట్ చేస్తోంది. ఈ సందర్భంగా జిలూ జోసెఫ్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈమె పేరు మార్మోగిపోతోందిప్పుడు.
గతంలో సీనియర్ నటి కస్తూరి కడా ఇలాగే తల్లి పాల ప్రాధాన్యతపై న్యూడ్‌గా బిడ్డకి పాలిస్తున్నట్టుగా ఫోటోలు దిగింది. అప్పట్లో ఆ ఫోటోలతో కస్తూరి సెన్సేషన్ అయ్యింది. తాజాగా ఇప్పుడు జిలూ జోసెఫ్ ఫోటోలు ట్రెండింగ్ అయ్యాయి. మరి ఈ భామ చేసిన ఈ సాహసంతో ఎంత అవేర్నెస్ వస్తుందో చూడాలి మరి.