మే 3న రిలీజ్ కానున్న జితేందర్ రెడ్డి

మరిన్ని వార్తలు

బాహుబలి మూవీ తో జాతీయ స్థాయిలో గుర్తింపు  పొందిన  రాకేష్ వర్రే, గతంలో ఎవ్వరికీ చెప్పొద్దు మూవీ లో  హీరో గా, నిర్మాతగా మారారు.   ఇప్పుడు జితేందర్ రెడ్డి మూవీ తో  ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.  గతంలో అసలు ఎవరు ఈ జితేందర్ రెడ్డి అని? అని హీరో ఫేస్ రివీల్ చెయ్యకుండా విడుదల చేసిన ప్రోమో, పోస్టర్ కి  మంచి ఆదరణ వచ్చింది. ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్నా ఈ జితేందర్ రెడ్డి సినిమా రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ ఈ రోజు విడుదల చేసింది. చిత్ర దర్శకుడు విరించి వర్మ ఈ  మూవీ  2024 మే 3న ఈ  విడుదల అని  చెప్పారు, ఈ సందర్భంగా దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరో ఎవరో చూపించకుండా విడుదల చేసిన పోస్టర్స్ కూడా మంచి క్యూరియాసిటీని పెంచాయి.. రాకేష్ వర్రే ఫ్యామిలీ హీరో గా ఎవ్వరికీ చెప్పొద్దు లాంటి లవ్ స్టొరీ చేసినప్పటికీ ఇలాంటి ఒక యాక్షన్ డ్రామా చెయ్యడం చాలా గొప్ప విషయం. ఈ జితేందర్ రెడ్డి జగిత్యాలలో 1980లలో యదార్ధంగా జరిగిన కథ. రియల్ స్టొరీ ని బాగా తియ్యడానికి చాలా రీసెర్చ్ అవసరమైన, దాని కోసం నేను మా టీం వర్క్ ఔట్ చేసి, రెఫెరెన్సులు తీసుకుని, పెద్ద వారి సలహాలు తీసుకుని చాలా జెన్యూన్ గా చేసిన సినిమా ఇది.. 


ముదుగంటి క్రియేషన్స్ అధినేత, నిర్మాత ముదుగంటి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, ఉయ్యాలా జంపాలా, మజ్ను లాంటి ప్రేమకథా చిత్రాలకు దర్శకత్వం వహించిన విరించి వర్మ, మా జితేందర్ రెడ్డి లాంటి యాక్షన్ స్టొరీ ని కూడా అద్భుతంగా తెరకెక్కించారు.. ఈ చిత్రం యొక్క పోస్టర్స్, గ్లిమ్స్ ను చాలా మంది అప్ప్రిషి ఎట్ చేస్తున్నారు, జితేందర్ రెడ్డి అనే టైటిల్ ఏ చాలా పవర్ఫుల్ టైటిల్. 1980లో నేను చూసిన, నాకు తెలిసిన కథ ఈ జితేందర్ రెడ్డి, అప్పటి లొకేషన్స్ గాని, అప్పటి అంబియన్స్ ని గాని చాలా చక్కగా తెరకెక్కించారు. మా హీరో రాకేష్ వర్రే గురించి మీకు చెప్పాలి, గతంలో లవ్ స్టొరీ చేసి ఇప్పుడు ఈ ఆక్షన్ డ్రామా ని కూడా చాలా బాగా హేండిల్ చేశాడు, తనకు సొంతగా క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ ఉన్నప్పటికీ, తన సినిమాలే మూడు జరుగుతున్నప్పటికీ కూడా ఈ జితేందర్ రెడ్డిని తన సొంత ప్రాజెక్ట్ లాగా, తన సినిమాల పనులు అడ్జస్ట్ చేసుకుని చాలా శ్రమని ఈ సినిమా కోసం పెట్టారు.. అప్పటి సన్నివేశాలని, జరిగిన కథని యదార్ధంగా చూపించాము తప్ప, ఎవరిని కించపరిచే విధంగా మాత్రం చెయ్యలేదు. సుబ్బరాజు గారి లాంటి విలక్షణ నటుడు కూడా మనసు పెట్టి అధ్బుతంగా ఈ కథ కోసం పని చేశారు. ఈ సినిమాకు సంబంధించిన విషయాలు  మీకు ఇక నుంచి ఇస్తూ ఉంటాము, మేము మొదటి సారి సినిమా ఇండస్ట్రీ కి వచ్చి ఈ సినిమా చేస్తున్నాము, మమ్మల్ని ఆశీర్వదించండి.


సాంకేతిక నిపుణులు విషయానికి వస్తే ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలకు (కంచే, NTR కథానాయకుడు, NTR మహానాయకుడు, IB 47) విషువల్స్ అందిచిన వి.ఎస్‌ జ్ఞాన శేఖర్‌ ఈ సినిమాకి కెమెరామెన్‌ గా పని చేశారు. అలాగే ఎన్నో లవ్ స్టోరీస్ కు మ్యూజికల్ హిట్స్ అందించిన మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్‌ జితేందర్ రెడ్డి సినిమాకు సంగీతం అందిస్తున్నారు. నాగేంద్రకుమార్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ముదుగంటి క్రియేషన్స్‌ బ్యానర్‌పై ముదుగంటి రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.


నటీ నటులు : రాకేష్ వర్రే, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్


సాంకేతిక నిపుణులు:
డైరెక్టర్: విరించి వర్మ.
నిర్మాత: ముదుగంటి రవీందర్ రెడ్డి.
కో - ప్రొడ్యూసర్: ఉమ రవీందర్.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వాణిశ్రీ పొడుగు
డి.ఓ.పి: వి. ఎస్. జ్ఞాన శేఖర్.
మ్యూజిక్ డైరెక్టర్: గోపి సుందర్.
ఆర్ట్ డైరెక్టర్: నాగేంద్ర కుమార్
పి ఆర్ వో: మదు వి ఆర్


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS