యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లి తెర బిగ్ షో 'బిగ్‌బాస్' కోసం ఎంతగానో అభిమానులు ఎదురు చూశారు. ఆ రోజు రానే వచ్చింది. ఈ షోకి ముహూర్తం మొదలైంది. షో స్టార్ట్ అయ్యింది. షో స్టార్టింగే ఎన్టీఆర్ ఫుల్ జోష్‌తో స్టేజ్‌పై తనదైన శైలిలో ఎంట్రీ ఇచ్చేశాడు. అయితే రెండు గంటల పాటు బుల్లితెరపై ప్రసారం కాబోతున్న ఈ షోకి ఎన్టీఆర్ బాగానే తీసుకుని ఉంటాడే అన్నదానికి 'నాకు సరిపడా చెల్లించారు' అన్న ఎన్టీయార్ మాటల్లోనే పూర్తి అర్థం కనిపిస్తోంది. అయినా యంగ్ టైగర్ ఎన్టీయార్ రికార్డు రెమ్యునరేషన్ తీసుకోవడంలో వింతేముంది? ఆయన స్టార్‌డమ్‌ని దృష్టిలో పెట్టుకుంటే ఎంత ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినా అది తక్కువే అవుతుందని ఆయన అభిమానులు భావిస్తుంటారు. 'బిగ్ బాస్' షో ప్రారంభోత్సవంలో ఎన్టీయార్ హావభావాలు, డైలాగ్ డెలివరీ, స్టేజ్ మీద ఎంట్రీ ఇస్తూ చేసిన సాంగ్ అన్నీ సింప్లీ సూపర్బ్. ఇంతకన్నా 'పైసావసూల్' బిగ్ బాస్ నిర్వాహకులకు ఇంకేముంటుంది? అయితే ఎన్టీయార్ ఈ షో చేస్తానని ఒప్పుకున్నది రెమ్యునరేషన్ కోసం కాదు, కొత్తదనం కోసం. ఇలాంటి ఓ షో ఎవరికైనా ఓ ఛాలెంజ్ లాంటిదే. ఆ ఛాలెంజ్‌ని ఎన్టీయార్ ధైర్యంగా స్వీకరించాడు, సత్తా చాటుతున్నాడు. మొత్తం 70 రోజులపాటు ఈ షో జరుగుతుంది. 14 మంది సెలబ్రిటీలు, సుమారు 60 కెమెరాలు, ఒకే ఇంట్లో జరిగే సంఘటనలు ఈ షో ప్రత్యేకత. ఇంకేం బీ రెడీ ఫర్ ఎంజాయింగ్ విత్ ఎన్టీఆర్ ఇన్ 'బిగ్‌బాస'్ షో.