టాలీవుడ్ సినిమాలు ప్రపంచ స్థాయిలో సత్తా చాటుతూ, ఇప్పుడిప్పుడే హాలీవుడ్ రేంజ్ కి చేరుతున్నాయి. ఒకప్పుడు బాలీవుడ్ తో పోటీ పడే మన తెలుగు సినిమాలు ఇప్పడు హాలీవుడ్ తో పోటీ పడేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇంత గొప్ప స్థాయిలో ఉన్న మనం ఫ్యాన్ వార్ తో కొంచెం వెనక పడుతున్నాం. మనల్ని మనం అప్రిసియేట్ చేసుకోలేక పోతున్నాం. మనలో మనమే కొట్టుకుని మన సినిమాని తొక్కేస్తున్నాం. బన్నీ నటించిన పుష్ప 2 సినిమా విషయం లో మెగా ఫాన్స్ ఇదే చేసారు. కానీ పుష్ప నార్త్ లో ఫుల్ వసూల్ చేసింది. నెక్స్ట్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ కి ఇదే పరిస్థితి. బన్నీ ఆర్మీ పని గట్టుకుని ఈ మూవీ పై నెగిటీవ్ టాక్ తెచ్చారు.
అలాగే గత కొన్నాళ్లుగా నందమూరి ఫాన్స్ రెండు టీమ్ లుగా విడిపోయి సోషల్ మీడియాలో కొట్టుకుంటు న్నారు. పరమానందయ్య శిష్యుల్లా మాహీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని బాలయ్యని, ఎన్టీఆర్ ని కూడా ఈ వివాదంలోకి లాగుతున్నారు. ఫ్యామిలీ మధ్యలో ఉంటే విభేదాలు ఉండొచ్చు వాటిని ఫాన్స్ మరింత పెంచుతున్నారు తప్ప తగ్గించటం లేదు. అసలు ఫాన్స్ చేస్తున్న రచ్చ వలనే బాలయ్య, ఎన్టీఆర్ మరింత దూరం అయ్యారన్నది వాస్తవం. ఈ క్రమంలోనే బాలయ్య సినిమాను మేము ఫ్లాప్ చేస్తామని ఎన్టీఆర్ ఫాన్స్, ఎన్టీఆర్ సినిమా వస్తే మేము ఊరుకుంటామా అని బాలయ్య ఫాన్స్ తమ తడాఖా చూపించారు.
కానీ తాజాగా జరిగిన సంఘటనతో వీటన్నికి చెక్ పెట్టి, ఫాన్స్ నోరుమూయించారు. కేంద్రం బాలయ్య కి 'పద్మ భూషణ్' ఇచ్చిన సంగతి తెలిసిందే. అనౌన్స్ చేసిన క్షణాల్లోనే ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా బాలా బాబాయ్ అంటూ విష్ చేసారు. బాలయ్యతో డాకు మహారాజ్ సినిమా చేసిన బాబీ కూడా బాలయ్య ఎన్టీఆర్ మధ్య గొడవలు లేవని స్పష్టం చేసారు. ఆ మధ్య ఎవరో ఎన్టీఆర్ ని బాలయ్యతో ఏంటి మీకు ప్రాబ్లెమ్ అని అడగ్గా, నాకేం సమస్య లేదు బాలయ్య మా బాబాయ్ అని ఎన్టీఆర్ చెప్పారని టాక్. బాలకృష్ణ కూడా కొన్ని సందర్భాలో ఎన్టీఆర్- కళ్యాణ్ రామ్ నా బిడ్డలు అంటూ చెప్పారు.
తాజా ఇన్సిడెంట్ తో మరొకసారి బాబాయ్, అబ్బాయ్ మధ్య విభేదాలు లేవని స్పష్టం అయ్యింది. సో ఇక నుంచి అయినా నందమూరి ఫాన్స్ వివాదాలకి చెక్ పెట్టి యూనిటీగా ఉంటారేమో చూడాలి.