టాక్ ఆఫ్ ది టౌన్‌: కాంతార‌లో ఎన్టీఆర్‌?

మరిన్ని వార్తలు

కాంతార.. క‌న్న‌డ చిత్ర‌సీమ స్టామినాని ప్ర‌పంచానికి చూపించిన సినిమా. ఉత్త‌మ న‌టుడిగా రిష‌బ్ శెట్టికి జాతీయ అవార్డు కూడా ద‌క్కింది. ఈ సినిమాకు ప్రీక్వెల్ ప్లాన్ చేశాడు రిష‌బ్ శెట్టి. ప్ర‌స్తుతం ఆ ప‌నులే జ‌రుగుతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కూడా క‌నిపిస్తే ఎలా ఉంటుంది? అదిరిపోతుంది కదూ. ఇది ఊహో, గాసిప్పో కాదు. ఆ అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి.


ఇటీవ‌ల ఎన్టీఆర్ కుటుంబ స‌మేతంగా క‌ర్ణాట‌క‌లోని కొన్ని దేవాల‌యాల‌ను సంద‌ర్శించుకొన్నాడు. ఆ స‌మ‌యంలో రిష‌బ్ ఎన్టీఆర్ తో పాటే ఉన్నాడు. ఎన్టీఆర్‌కు ఆతిథ్యం ఇచ్చాడు. ఈ సంద‌ర్భంగా 'కాంతార 2'లో మీరు న‌టిస్తురా' అనే ప్ర‌శ్న తార‌క్‌కు ఎదురైంది. ''అదంతా రిష‌బ్ శెట్టి చేతుల్లో ఉంది. ఆయ‌న ప్లాన్ చేస్తే నేను న‌టించ‌డానికి సిద్ధ‌మే'' అని ప‌చ్చ‌జెండా మ‌న‌సులో మాట చెప్పేశాడు తార‌క్.


ప్రీక్వెల్ కు కొత్త ఎన‌ర్జీ ఇవ్వ‌డానికి ఎన్టీఆర్ కోసం ఓ ప్ర‌త్యేక‌మైన పాత్ర రిష‌బ్ శెట్టి రాసుకొన్నా ఆశ్చ‌ర్చ‌పోవాల్సిన అవ‌స‌రం లేదు. కాంతార ఫ్రైంచైజీకి అది అవ‌స‌రం కూడా. పాన్ ఇండియా సినిమా సంస్కృతి బాగా పెరిగిపోయింది. హీరోలంతా మిగిలిన భాష‌ల్లో న‌టించ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఎన్టీఆర్ - రిష‌బ్ మ‌ధ్య మంచి బాండింగ్ ఉంది. కాబ‌ట్టి.. ఎన్టీఆర్ ఇచ్చిన అవ‌కాశాన్ని రిష‌బ్ వ‌దులుకోడ‌నే అనిపిస్తోంది. చూద్దాం.. ఏం జ‌రుగుతుందో..?  రిష‌బ్, ఎన్టీఆర్‌లు క‌లిస్తే మాత్రం కాంతార‌ ప్రీక్వెల్ ఓ రేంజ్‌లో త‌యార‌వ్వ‌డం ఖాయం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS