ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా `జై లవకుశ` ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. బ్లాక్ షర్ట్, కళ్లజోడు, మెలితిరిగిన మీసంతో... మాస్ లుక్‌లో కనిపించాడు ఎన్టీఆర్. 'జై లవకుశ'లో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో 'జై'కి సంబంధించిన లుక్ ఇది. మూడు లుక్లనూ ఒకేసారి రివీల్ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే.. ఈసారికి కేవలం జై లక్‌తోనే సరిపెట్టింది చిత్రబృందం. ఈ లుక్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఎన్టీఆర్ కొత్తగా కనిపిస్తున్నాడని మురిసిపోతున్నారు. కొంతమంది మాత్రం.. చాలా ఎక్కువ ఆశించి భంగపడ్డారు. ఎన్టీఆర్ మేకప్ కోసం హాలీవుడ్ నిపుణుడ్ని రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే. ఆ మేకప్ మెన్ పర్యవేక్షణలో ఎన్టీఆర్ గెటప్ పూర్తిగా మారిపోయిందని, ఆ గెటప్పే ఇప్పుడు రివీల్ చేస్తారని ఆశించారు. కాకపోతే.. 'దమ్ము' తరహా స్టిల్ రావడంతో వాళ్లు కుసింత నిరాశ పడ్డారని తెలుస్తోంది. ఇప్పటికైతే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఫస్ట్ లుక్‌లో లవకుశ ఫస్ట్ క్లాస్ మార్కులతో పాసైపోయినట్టే.