ఎన్టీఆర్ జై లవకుశ చిత్రంతో ఒక పెద్ద సవాలుని స్వీకరించాడు అనే చెప్పాలి. అయితే త్రిపాత్రాభినయం చేయడానికి కారణమేంటి అని అడగగా- సవాలుని స్వీకరించడం అలాగే ఆ సవాలుని విజయవంతంగా పూర్తి చేయాడంలోనే తనకి అసలు కిక్ అని చెప్పాడు.
జై లవకుశ చిత్ర కథ విషయానికి వస్తే, కథ ఎంచుకునే విషయంలో ఎన్టీఆర్ వైవిధ్యాన్ని చూపెట్టాడు అని మన ఈచిత్రం చూస్తే స్పష్టమవుతుంది. ఇదేకాకుండా జై లవకుశ చిత్రానికి తారక్ ఇంతకుముందు ఎన్నడు తీసుకొని విధంగా ఒక పాత్ర కోసం ముందే సిద్ధమవ్వడం కూడా అతని కెరీర్ లో ఇదే ప్రధమం.
అయితే అందరు ఎదురుచూసిన ‘రావణ’ పాత్ర నిడివి తక్కువగా ఉండడంతో ప్రేక్షకులు ఒకింత నిరాశకు గురయ్యారు అన్నది వాస్తవం. దర్శకుడు ‘రావణ’ పాత్ర నిడివి మరింత పెంచి చూపిస్తే బాగుండేది అని కూడా సర్వత్రా వ్యక్తమైన అభిప్రాయం.
ఇక జై లవకుశ చిత్రానికి సంబంధించి ఇప్పటికే మూడురోజుల్లో రూ 75 కోట్ల గ్రాస్ తో తారక్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టిస్తున్నది. ఇక ఈరోజు వచ్చే కలెక్షన్స్ తో కచ్చింతంగా ఇది రూ 100కోట్ల మార్కు అందుకునే అవకాశం మెండుగా ఉన్నట్టు సమాచారం.
మొత్తానికి తారక్ ఈ ఏడాది దసరాని ఘనంగా మొదలెట్టాడు అని చెప్పాలి.