పలు సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన జ్యోతిక పరిచయం అక్కర్లేని పేరు. తమిళంతో పాటు తెలుగులో కూడా జ్యోతిక నటించింది. మెగాస్టార్‌తో కలిసి 'ఠాగూర్' సినిమాలో నటించింది జ్యోతిక. 'చంద్రముఖి' ఆమె కెరీర్ బెస్ట్ మూవీగా చెప్పొచ్చు. అయితే తమిళ్ హీరో సూర్యని ప్రేమించి, పెళ్లి చేసుకుని, ఇద్దరు బిడ్డలకు తల్లిగా తన బాధ్యతను సక్రమంగా నెరవేర్చింది. పెళ్లి తర్వాత ఆమె సినిమాల గురించి పెద్దగా ఆలోచించలేదు. అయితే ఈ మధ్యే ఈ ముద్దుగుమ్మ ఓ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. అదే '36 వయదినిలే' సినిమా. ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత జ్యోతిక వరుసగా సినిమాల్లో నటించాలనుకుంటోందట. అందులో భాగంగా భర్త సూర్య నిర్మాణంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. 'మగళిర్ మట్టుమ్' అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కుతోంది. తాజాగా విడుదలైన ఈ సినిమాలోని జ్యోతిక లుక్ అందర్నీ ఆకర్షిస్తోంది. అంతే కాదు జ్యోతిక ఇకపై సినిమాల్లో కొనసాగాలనుకుంటోందట. తెలుగు, తమిళం ఇలా ఎక్కడైనా సరే మంచి అవకాశాలొస్తే యూజ్ చేసుకుంటానంటోంది. జ్యోతిక మంచి నటి. కళ్లతోనే అనేక భావాలు పలికించగలదు. చాలా ఎక్స్‌ప్రెసివ్ ఫేస్ ఈ ముద్దుగుమ్మది. అయిత వయసుకు తగ్గ హుందా పాత్రల్లోనే నటిస్తానంటోందట జ్యోతిక. అంటే ఇకపై డిగ్నిఫైడ్ క్యారెక్టర్స్ కోసం మన టాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా జ్యోతికను రిమైండ్ చేసుకోవచ్చన్న మాట.