దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకోవడం ద్వారా తెలుగు చలనచిత్ర పరిసరం ఖ్యాతిని దశదిశలా వ్యాపింపచేసిన కళాతపస్వి కె విశ్వనాధ్ గారికి నేడు ఘన సన్మానం జరుగనున్నది.
ఈ సన్మానం తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరపున విశ్వనాధ్ గారికి నేటి సాయంత్రం జరుగుతున్నది. దీనికి ముఖ్య అతిధిగా రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ అయిన నరసింహన్ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో అంగరంగ వైభవంగా జరగబోతున్నది.
ఇక నేటి ఉదయం, సూపర్ స్టార్ కృష్ణ, సీనియర్ హీరో నరేష్ విశ్వనాధ్ గారి ఇంటికి వెళ్ళి ఆయనను శాలువతో సన్మానించి అభినందనలు తెలియచేశారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమ విశ్వనాథ గారిని సన్మానించడం ద్వారా తనని తాను గౌరవించుకొనున్నది.