కళా తపస్వి అనగానే మనకు టక్కున గుర్తొచ్చే పేరు కె విశ్వనాధ్ గారు. ఆయన తీసిన సినిమాల ద్వారా ఆయన గడించిన పేరు కన్నా వాటి వల్ల తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఖ్యాతిని దశదిశలా వ్యాపింప చేశారు అన్నది అక్షర సత్యం.
ఇక ఇలాంటి మహా మనిషికి నేడు భారత ప్రభుత్వం చలనచిత్రాలకు సంబందించిన అత్యున్నత పురస్కారం అయిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని ప్రకటించడం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు, తెలుగు సినిమా అభిమానికి ఒక తీయని కబురు.
ఈ అవార్డుని దేశ రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనున్నారు. ఈ అవార్డుతో పాటుగా స్వర్ణ కమలం, రూ10లక్షల నగదు బహుమతిగా ప్రభుత్వం అందివ్వనుంది. కె విశ్వనాధ్ గారు ఈ అత్యునత అవార్డు పొందిన 7వ తెలుగు వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఈయనకు ముందు బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి (1974), పైడిరాజ్ (1980), ఎల్వీ ప్రసాద్ (1982), నాగిరెడ్డి (1986), అక్కినేని నాగేశ్వర రావు (1990), రామానాయుడు (2009).
ఇప్పటివరకు ఆయన తెలుగు-హిందీలో కలిపి సుమారుగా 50 చిత్రాలకు దర్శకత్వం వహించగా, వాటికి ఎన్నో జాతీయ అవార్డులతో పాటు, ఫిలిం ఫేర్, నంది అవార్డులు ఆయన సొంతమయ్యాయి.
మళ్ళీ ఒకసారి ఇంతటి అత్యున్నత పురస్కార గ్రహీతకు www.iqlikmovies.com తరపున ఇవే మా నమస్సుమాంజలులు.