'కాలా' చంపేస్తున్నారిలా.!

మరిన్ని వార్తలు

'కాలా' సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మార్నింగ్‌ షో పడడానికి ముందే 'కాలా'ని పైరసీ బూతం వెంటాడింది. ఫస్ట్‌ షో పడడానికి ముందే సోషల్‌ మీడియాలో కాలా వీడియో విడుదలైపోయింది. కొందరు ఆకతాయిలు చేసిన ఈ దుశ్చర్యకు రజనీ అభిమానులు తీవ్రంగా కలత చెందుతున్నారు. 

ఏకంగా 45 నిముషాల ఏకధాటి వీడియో నెట్‌లో హల్‌చల్‌ చేసేస్తోంది. దీంతో ఏం చేయాలో తోచని స్థితిలో చిత్ర యూనిట్‌ ఆందోళన చెందుతోంది. కోట్లు ఖర్చుపెట్టి తెరకెక్కించిన సినిమాలు ఇలా సింపుల్‌ లీకేజీలతో అర్ధాంతరంగా చచ్చిపోతున్నాయి. ఏ సినిమా విడుదలైన వాటిని ఏదో ఒక రకంగా పైరసీ బూతం వెంటాడుతూనే ఉంది. 'కాలా' ఓపెనింగ్స్‌పై చిత్ర యూనిట్‌, అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ లీకేజీ బూతం 'కాలా'పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి మరి. 

'కబాలి' తర్వాత రజనీ నుండి వస్తున్న సినిమా ఇది. 'కబాలి' అంచనాలను అందుకోకపోయినా, ఈ సినిమాతో అభిమానుల ఆశలు నెరవేర్చాలనే యోచనలో ఉన్నాడు సూపర్‌స్టార్‌. 'కబాలి' దర్శకుడు పా రంజిత్‌ దర్శకత్వంలోనే ఈ చిత్రం కూడా తెరకెక్కింది. ధనుష్‌ నిర్మాతగా వ్యవహరించారు. పా రంజిత్‌, ధనుష్‌ చాలా ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని టేకప్‌ చేశారు. 

ఎలాగైనా సూపర్‌ డూపర్‌ హిట్‌ సినిమాగా 'కాలా' నిలవాలని చిత్రయూనిట్‌ కోరుకుంటోందట. చూడాలి మరి, ఈ తాజా లీకేజీల నుండి గట్టెక్కి, సినిమా కంటెన్ట్‌తో, తన సూపర్బ్‌ స్టైల్‌తో సూపర్‌స్టార్‌ అభిమానుల్ని ఎలా ఆకట్టుకుంటాడో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS