గ్లామ్‌షాట్‌: ఓ వసుమతీ నీ గ్లామర్‌తో పోయింది మతీ.!

By iQlikMovies - December 15, 2018 - 16:47 PM IST

మరిన్ని వార్తలు

దేవదారు శిల్పంలా అంటూ మహేష్‌బాబు ఈ బ్యూటీపై పాటేసుకున్నాడు. నిజంగానే దేవదారు శిల్పంలాగే ఫ్లెక్సిబుల్‌ బాడీ ఈ ముద్దుగుమ్మది. వయ్యారంతో కూడిన స్టైల్‌ని అంగాంగ బంధనం చేసేసింది ముద్దుగుమ్మ కైరా అద్వానీ. డాన్సుల్లో, నడకలో ఈ బ్యూటీ స్టైల్‌కి ఎవ్వరైనా ఫిదా కావల్సిందే. అందుకే వస్తూ వస్తూనే రెండు బిగ్‌ ఆఫర్స్‌ని తన ఖాతాలో వేసుకుంది. తొలి సినిమా 'భరత్‌ అనే నేను'తో బ్లాక్‌ బస్టర్‌ అరదుకుంది.

 

ఇక ఇప్పుడు మెగా పవర్‌ స్టార్‌తో 'వినయ విధేయ రామ' సినిమాతో రాబోతోంది. ఈ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన స్టిల్స్‌లో కైరా తన అందంతో అందర్నీ డామినేట్‌ చేసేస్తోంది. ఇక తాజా పిక్‌ విషయానికి వస్తే, బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ హాట్‌ కాస్ట్యూమ్‌లో నిజంగానే దేవదారు శిల్పంలా మతులు పోగొట్టేస్తోంది. దేవదారు శిల్పానికి షైనింగ్‌ ఎక్కువ, అలాగే కైరా గ్లామర్‌ కి కూడా. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS