సినీ తారల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలపై జనానికి ఆసక్తి చాలా చాలా ఎక్కువ. అందుకే, దాదాపుగా సినీ తారల వ్యక్తిగత విషయాలన్నీ బయటకు పొక్కేస్తుంటాయి. లవ్ ఎఫైర్స్ అయితే అస్సలు దాచలేరు. కానీ, కాజల్ ఏడేళ్ళ ప్రేమాయణం గురించి మాత్రం ఎవరికీ తెలియలేదంటే.. అది ఆషామాషీ వ్యవహారం కాదు. ‘ఏడేళ్ళుగా ప్రేమించుకుంటున్నాం.. లాక్‌డౌన్‌లో పెళ్ళి చేసుకోవాలనుకున్నాం..’ అంటూ కాజల్ తన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
కానీ, ఇది నిజమేనా.? అన్న సందేహాలు కలుగుతున్నాయి చాలామందికి. తన భర్త గౌతం గురించి చెబుతూ, చాలా సైలెంట్‌గా వుంటాడనీ, అన్ని విషయాలపైనా స్పష్టమైన వైఖరితో వుంటాడనీ, డ్రమెటిక్‌గా కాకుండా.. సింపుల్‌గా ప్రపోజ్ చేయడంతో పెళ్ళికి అంగీకరించానని కాజల్ చెప్పింది. అయితే, ఇన్‌సైడ్ సోర్సెస్ మాత్రం.. కరోనా లాక్‌డౌన్ తర్వాత కాజల్ ఆలోచనలు మారాయనీ.. ఈ క్రమంలోనే కాజల్‌కి పెళ్ళి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారనీ.. అంతకు మించి ఇద్దరి మధ్యా ప్రేమ వ్యవహారాలు వుండి వుండకపోవచ్చనీ అంటున్నాయి.
మరి, కాజల్ ఎందుకిలా చెబుతోంది.? అంటే, ఇదంతా జస్ట్ పబ్లిసిటీ స్టంట్ అని కొందరు కొట్టిపారేస్తున్నారు. ఎవరి గోల వారిది. కాజల్ అబద్ధం చెబుతోందని అనుకోగలమా.? ఏమోగానీ, కాజల్ చెబుతున్నదే నిజమైతే, ఏడేళ్ళపాటు గౌతంతో ఎఫైర్‌ని దాచి పెట్టడం చిన్న విషయం కాదు. సో, కాజల్ చాలా గ్రేట్ అనుకోవాలి.