అదేంటి కాజల్ కి ఇప్పుడు కూడా ప్రేక్షకుల్లో కావలసినంత ఫాలోయింగ్ ఉంది కదా.. తను ఇలాంటి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చిందో అని కంగారుపడకండి.
వివరాల్లోకి వెళితే, తన కాలేజీ రోజులని గుర్తుచేసుకుంటూ- తనకి అందరు అమ్మయలకి ఉన్నట్టే మంచి ఫాలోయింగ్ ఉండేది అని అయితే తనని ఎవ్వరు ఇబ్బందికి మాత్రం గురిచేయలేదు అని చెప్పింది. తను అలాగే తన చెల్లెలు నిషా ఈ ఫాలోయింగ్ ని ఎంజాయ్ చేసేవాళ్ళం అని ఇక తమ తల్లిదండ్రులకిఈ విషయమై చెప్పే అంత పరిస్థితి ఎప్పుడు కలగలేదు అని చెప్పుకొచ్చింది.
ఇక ఈ అమ్మడు సినిమాల్లోకి వచ్చాక వచ్చిన క్రేజ్ గురించి అడగగా- నటిగా తన ప్రయాణం ఇలా సాఫీగా సాగిపోవడానికి కారణం ఫ్యాన్సే అని తన ఆనందం వ్యక్తం చేసింది.
ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నటిస్తున్న MLA చిత్రంలో హీరోయిన్ గా చేస్తున్నది.