అవునండీ చందమామ క్వీన్ విక్టోరియానే. చూస్తున్నారుగా విక్టోరియా రాణిలానే తలపై ధరించిన ఆ కిరీటం, రాజసం ఉట్టిపడే ముఖారవిందం అన్నీ చూస్తుంటే మరి క్వీన్ విక్టోరియానే గుర్తుకొస్తోంది.
అయితే ఈ గెటప్‌లో కాజల్ ఎందుకు దర్శనమిచ్చిందంటే, సోనీ విక్టోరియా ఛానెల్లో ఓ ప్రోగ్రామ్‌కి సంబంధించి కాజల్ ఇలా అలంకరించుకుంది. సింప్లీ సూపర్బ్ అనేలా ఉంది కదా ఈ గెటప్‌లో కాజల్. దశాబ్థానికి పైగానే తెలుగు తెరపై హీరోయిన్గా వెలుగొందుతోంది. కానీ ఎక్కడా ఇసుమంతైనా తరగని గ్లామర్‌తో ఇప్పటికీ అదే ఫ్రెష్ లుక్‌లో కుర్రకారును మైమరిపిస్తోంది. నింగిలోని ఆ చందమామకైనా మచ్చ ఉందేమో కానీ, నేలపై ఉన్న ఈ చందమామకు మాత్రం ఎలాంటి మచ్చ లేదంటే అతిశయోక్తి కాదేమో.
గ్లామర్‌కీ, క్యూట్నెస్కీ సంబంధించి, తొలి సినిమాలో ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉండడం కాజల్ ప్రత్యేకత. అందుకే ఎవర్ గ్రీన్ గ్లామర్ క్వీన్ కాజల్ అంతే.