కాజల్‌ అగర్వాల్‌ ముద్దుల గోలేంటీ.?

మరిన్ని వార్తలు

రూమర్స్‌కీ, గాసిప్స్‌కీ కాజల్‌ అగర్వాల్‌ ఎప్పుడూ దూరంగా ఉంటుంది. కానీ, అప్పుడప్పుడూ తనకు తెలియకుండానే బుక్‌ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడో జరిగిన ఇష్యూని కావాలని కెలుక్కుని తాజాగా కాజల్‌ చర్చల్లో నిలిచింది. ఇంతకీ అసలు సంగతేంటంటే, అప్పుడెప్పుడో కాజల్‌ నటించిన హిందీ సినిమా 'దో లఫ్‌జోంకా కహానీ' సినిమాలో లిప్‌లాక్‌లో నటించిందట. ఆ సినిమాలో కాజల్‌ అంధురాలిగా నటించింది. ఓ సీన్‌ కోసం హీరోతో లిప్‌ టు లిప్‌ కిస్‌లో నటించాల్సి వచ్చిందట. అయితే, ఆ సీన్‌లో నటించడం కాజల్‌కి అస్సలు నచ్చలేదట. చాలా ఇబ్బందికరంగా అనిపించిందట. అయినా కానీ, చిత్ర యూనిట్‌ ఒత్తిడి మేరకు ఆ సీన్‌లో నటించాల్సి వచ్చిందంన్నట్లుగా కాజల్‌ చెప్పుకొచ్చింది. వాస్తవానికి ఎప్పుడో జరిగిపోయిన ఆ ఇష్యూ గురించి ఇప్పుడు చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ, కావాలిని కొరివితో తల గోక్కోవడం అంటే ఇదే మరి. దీంతో కాజల్‌ ఎప్పుడూ ఇంతే, మాట మార్చేయడం ఆమెకు అలవాటే.. అంటూ ఆమె పుట్టు పూర్వత్తరాలు వెలికి తీసేస్తున్నారు నెటిజన్లు .

 

గతంలో ఓ మ్యాగజైన్‌ కోసం కాజల్‌ టాప్‌లెస్‌గా పోజిచ్చింది. తర్వాత ఆ ఫోటో ఫేక్‌ అని స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. కానీ, ఇదిగో ఆ ఫోటో షూట్‌ సమయంలో తీసిన ఫోటోలు అంటూ ఆ మ్యాగజైన్‌ యూనిట్‌ ప్రూఫ్స్‌ చూపించారు. ఆమె సమ్మతితోనే ఆ ఫోటో షూట్‌ జరిగిందని వారు చెప్పారు. దాంతో అక్కడ కాజల్‌ ఫేక్‌ అని తేలిపోయింది. అంతెందుకు త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న తాజా చిత్రం 'ప్యారిస్‌ ప్యారిస్‌'లోనూ ఓ జుగుప్సాకరమైన సీన్‌లో కాజల్‌ నటించింది. రేపు సినిమా విడుదలయ్యాక ఆ సీన్‌ కూడా ఫేక్‌ అని స్టేట్‌మెంట్‌ ఇస్తుందేమో కాజల్‌ అగర్వాల్‌ చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS