కాజల్‌ చేజారుతోన్న మెగా మూవీ.!

మరిన్ని వార్తలు

మెగా మూవీ అంటే మెగా మూవీనే.. ఇండియన్‌ సినిమా స్క్రీన్‌పై అత్యంత భారీ సినిమాలు తీసే దర్శకుల్లో తమిళ దర్శకుడు శంకర్‌ గురించి మరింత ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయితే, గత కొంత కాలంగా శంకర్‌, తన స్థాయికి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నాడన్నది నిర్వివాదాంశం.

 

ఈ నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘ఇండియన్‌ 2’ (భారతీయుడు2) ప్రారంభించాడుగానీ, ఆ సినిమాకి బాలారిష్టాలు దాటుకుని, ఎప్పుడు పూర్తవుతుందో ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో తెలియని పరిస్థితి. ఈ సినిమా కోసం హీరోయిన్‌గా కాజల్‌ అగర్వాల్‌ ఎంపికవడం, కొన్ని సీన్స్‌లో ఆమె నటించడం, కొన్ని కారణాలతో సినిమా షూటింగ్‌ వాయిదా పడటం, ఆ తర్వాత కరోనా దెబ్బతో షూటింగ్‌ పూర్తిగా నిలిచిపోవడం తెలిసిన సంగతులే.

 

ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా నటిస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ‘ఇండియన్‌2’ సినిమా నుంచి కాజల్‌ తప్పుకుందట. శంకర్‌ సినిమా అంటే బల్క్‌ డేట్స్‌ ఇవ్వాలి. గతంలో అలా ఇవ్వడం వల్లే, కాజల్‌ కొన్ని సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరు. ఇటీవలే ఆమెకు పెళ్ళయ్యింది. ఇంకోపక్క కొత్తగా కొన్ని సినిమాలకు కమిట్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ‘ఇండియన్‌2’ సినిమాకి డేట్స్‌ ఇవ్వడం సాధ్యమయ్యేలా లేదట కాజల్‌కి. దాంతో ఆ సినిమాని ఆమె వదిలేసుకున్నట్లేనని అంటున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS