మీరు విన్నది నిజమేనా అంటే ఏమో నిజమైనా కావచ్చు. అవును కాజల్ అగర్వాల్ తాజాగా ప్రధాని నరేంద్రమోడీని పొగుడుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. నా ఫుల్ సపోర్ట్ మీకే మోడీజీ అంటూ. అయితే కాజల్ ఈ పోస్ట్ ఎందుకు పెట్టింది అంటే, విమెన్స్ డే రోజు ప్రధానమంత్రి మోడీ మహిళా సెలబ్రిటీస్ అందరికీ విషెస్ చెబుతూ ఓ లేఖ పంపించారు. అందులో భాగంగా ముద్దుగుమ్మ కాజల్ ఆగర్వాల్‌కి కూడా మోడీజీ పేరుతో ఆ లేఖ అందింది.
మహిళా సాధికారత విషయంలో మోడీ ప్రవేశపెట్టిన బేఠీ బచావో బేఠీ పడావో, స్త్రీ శక్తి తదితర మహిళల అభివృద్ది పథకాల పట్ల తానెంతో ఇన్‌స్పైర్ అయ్యాయనీ, ఇలాంటి పథకాలు మహిళల రక్షణ, పర్యవేక్షణల్లో పలు మార్పులు తీసుకొస్తాయనీ, అందుకే ఆ విషయంలో మోడీకి తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందనీ కాజల్ ప్రకటిస్తూ, ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపింది. ఈ పోస్ట్‌తో కాజల్ అగర్వాల్‌కు రాజకీయాలపై ఆశక్తి మళ్లిందా? ఏంటి అని కొందరు ప్రచారం చేస్తున్నారు. అయినా ఏముంది. సినిమా తర్వాత సెలబ్రిటీస్‌కి నెక్స్ట్ ఆప్షన్ రాజకీయమే కదా. చాలా మందికి మేకప్ పై బోర్ కొడితే, నెక్ట్స్ రాజకీయ రంగు పులుముకోవాలని భావిస్తుంటారు. అందులో తప్పేముంది.
అలాగే కాజల్ కూడా భావిస్తోందేమో చూడాలి మరి. ఏది ఏమైనా కాజల్ మోడీకి క్యాజువల్‌గానే థాంక్స్ చెప్పినా కానీ, ప్రచారం మాత్రం మరోలా ఉంది. ఇదిలా ఉంటే, కాజల్ కెరీర్ సినిమాల్లో ఇప్పుడు జెట్ స్పీడుతో దూస్కెళ్లిపోతోంది. ఇలాంటి తరుణంలో రాజకీయాల గురించి ఆలోచిస్తుందనయితే అనుకోలేం. కాజల్ తెలుగులో నటించిన 'ఎమ్యెల్యే' చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. తమిళంలో 'ప్యారీస్ ప్యారీస్' చిత్రంలో నటిస్తోంది కాజల్ అగర్వాల్.