కాజల్‌కి మరో లక్కీ ఛాన్స్ దక్కింది. ఈ వెటరన్ భామ ఇప్పుడు బాలయ్యతో జోడీ కట్టబోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే.
కాజల్ థానాయికగా నటిస్తోంది. శ్రీలీల కీలక పాత్రధారి. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. సోమవారం ఈ సినిమా సెట్లో కాజల్ అడుగు పెట్టింది. బాలయ్యతో కాజల్ జోడీ కట్టడం ఇదే తొలిసారి. అందుకే ఈ కాంబోపై ఇప్పటి నుంచే ఆసక్తి మొదలైంది. కాజల్ పాత్ర రెగ్యులర్ హీరోయిన్ పాత్రలకు చాలా భిన్నంగా ఉంటుందని, ఆమె పాత్ర ఎమోషనల్ గా సాగుతుందని సమాచారం. అనిల్ రావిపూడి సినిమాలన్నీ ఫన్ ఎంటర్‌టైనర్లు. కాకపోతే.. ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి తన పంథాని పూర్తిగా మార్చేశాడట. తనలోని యాక్షన్ యాంగిల్ ని ఈ సినిమాలో చూపించబోతున్నాడట. బాలయ్య పాత్ర ఈ సినిమాలో వైవిధ్యంగా ఉంటుందని, ఫన్‌కి చాలా తక్కువ స్కోప్ ఉందని తెలుస్తోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ యేడాది చివర్లో గానీ, 2024 సంక్రాంతికి గానీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావొచ్చు.