నందమూరి కళ్యాణ్ రామ్ కి తన భార్య నుండి ఒక మంచి సలహా లభించిందట.
ఈ విషయాన్ని కళ్యాణ్ రామే స్వయంగా చెప్పాడు. మొన్ననే మెగాస్టార్ చిరంజీవి తో కలిసి శతమానం భవతి టీంని సత్కరించే వేడుకలో పాల్గొన్న కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ- తన భార్య శతమానం భవతి సినిమా చూసి కుదిరితే ఇలాంటి చిత్రంలో నటించమని అంతే తప్ప యాక్షన్ ఎక్కువగా ఉండే చిత్రాలు చేయకండి అని సలహా ఇచ్చిందట.
ఈ విషయాన్నివెల్లడిస్తూ, శతమానం భవతి లాంటి చిత్రాలని ప్రభుత్వం గుర్తించి ఇలా అవార్డు ఇవ్వడం చాలా మంచి పరిణామం అని అలాగే చిరంజీవి గారు కూడా ఈ టీంని సత్కరించడం మంచి సాంప్రదాయమని అభిప్రాయపడ్డాడు.
మరి కళ్యాణ్ రామ్ తన భార్య చెప్పిన విలువైన సలహా పాటిస్తాడా లేదా అనేది చూడాలి.