ఈ నెల 'కిర్రాక్ పార్టీ' మినహాయిస్తే సరైన సినిమా ఏదీ రాలేదు. 'కిర్రాక్ పార్టీ' కూడా 'సోసో' అన్పించేసిందంతే. ఈ టైమ్‌లో కళ్యాణ్‌రామ్ 'ఎమ్మెల్యే' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు. ప్రోమోస్ అయితే అదిరిపోతున్నాయి. సినిమాలో కాజల్ వుంది కదా, ఆమె వుంటే సినిమా హిట్టేనన్న అభిప్రాయాల కారణంగా 'ఎమ్మెల్యే' సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
అది హీరో కళ్యాణ్‌రామ్‌కి మేజర్ ప్లస్ పాయింట్. సినిమా బిజినెస్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే జరిగిందట. అవన్నీ పక్కన పెడితే, ఈ ఏడాది ఇప్పటిదాకా నిఖార్సయిన హిట్ సినిమా ఒక్కటీ రాకపోవడంతో టాలీవుడ్ ఒకింత దిగాలుగా వుంది. సగటు సినీ అభిమాని కూడా మాంఛి సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. 'భాగ్‌మతి' సినిమా ఒక్కటే కాస్తో కూస్తో చెప్పుకోదగ్గ హిట్ సినిమా. 'ఛలో' కూడా బాగానే కలెక్ట్ చేసింది. అయినాగానీ, ఇంకేదో ఆశిస్తున్న అభిమానులకి ఆ ఆశిస్తున్న హిట్ 'ఎమ్మెల్యే' ఇచ్చేలానే వుంది.
ప్రీ రిలీజ్ సినిమాకి మంచి టాక్ నడుస్తోంది. ఆ ప్రీ రిలీజ్ టాక్, పోస్ట్ రిలీజ్ కూడా వస్తే సినిమా అదిరిపోయినట్లే. ఆ తర్వాత వచ్చేవారం 'రంగస్థలం' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేస్తుంది. అప్పటిదాకా 'ఎమ్మెల్యే' పండగ చేసేసుకోవచ్చు. సినిమా థియేటర్ల బంద్ తర్వాత నెలకొన్న స్తబ్ధతని 'కిర్రాక్ పార్టీ' క్యాష్ చేసుకోలేకపోయింది.
మరి 'ఎమ్మెల్యే'గా కళ్యాణ్‌రామ్ అయినా ఆ గ్యాప్‌ని ఫుల్‌ఫిల్ చేస్తాడా? 'పటాస్' తర్వాత ఆ రేంజ్ ఎంటర్‌టైన్‌మెంట్ 'ఎమ్మెల్యే' సినిమాతో ఇస్తాడా? వేచి చూడాలిక.