లవ్ స్టోరీ బయట పెట్టిన కల్యాణీ ప్రియదర్శన్.

మరిన్ని వార్తలు

'హలో' సినిమాలో చిన్నప్పటి స్నేహమే వయసుతో పాటు, వారిలో ప్రేమగా మారుతుంది. ఇది సినిమా కథ. ఈ సినిమాతోనే హీరోయిన్‌గా పరిచయమైంది ముద్దుగుమ్మ కళ్యాణీ ప్రియదర్శన్‌. ఈ ఇయర్‌లో కళ్యాణీ 'చిత్రలహరి'తో మంచి హిట్‌ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శివకార్తికేయన్‌తో తమిళంలో ఓ సినిమాలో నటిస్తోంది. అయితే, ఈ బ్యూటీ లవ్‌ మ్యాటర్‌ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.

 

అంటే, కళ్యాణీ లవ్‌లో పడిందా.? అనే డౌట్‌ ఎక్స్‌ప్రెస్‌ చేస్తున్నారా? అవునండీ మీ డౌట్‌ నిజమే. తన ప్రేమ వ్యవహారాన్ని తానే స్వయంగా బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ. అయితే, పేరు మాత్రం సస్పెన్స్‌లో పెట్టిందండోయ్‌. కానీ, ఆ పేరు, ఆ వ్యక్తి ఎవరో ఓ మోస్తరుగా అంచనా వేస్తున్నారు క్యూరియాసిటీ పర్సన్స్‌. ఇంతకీ హలో బ్యూటీ చైల్డ్‌హుల్డ్‌ లవర్‌ ఎవరో తెలుసా? మలయాల సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ తనయుడు ప్రణవ్‌. ప్రణవ్‌ ప్రస్తుతం మలయాళ సినిమాలతో బిజీగా ఉన్నాడు. చిన్నతనం నుండీ, ప్రణవ్‌తో కళ్యాణీకి మంచి స్నేహం ఉండేదట. ఆ స్నేహమే ఇప్పుడు ప్రేమగా పెరిగి పెద్దదైందంటున్నారు. మోహన్‌లాల్‌ కుటుంబానికీ, కళ్యాణీ తండ్రి, ప్రముఖ దర్శకుడు అయిన ప్రియదర్శన్‌ కుటుంబానికీ మంచి స్నేహం ఉంది.

 

వీరిద్దరి కాంబినేషన్‌లో దాదాపు చాలా సినిమాలు తెరకెక్కాయి కూడా. సో అలా ప్రణవ్‌, కళ్యాణీల మధ్య స్నేహం, ప్రేమగా చిగురులు తొడిగిందంటున్నారు. ఈ మధ్య తన లవ్‌ అఫైర్‌పై వస్తున్న కామెంట్స్‌కి స్పందించిన కళ్యాణీ తన ప్రేమకు ఎలాంటి అడ్డంకల్లేవనీ, ఫ్యామిలీ మెంబర్స్‌ నుండి కూడా అబ్జక్షన్స్‌ లేవనీ, పెళ్లి చేసుకుంటే ఆయన్నే చేసుకుంటానని చెప్పుకొచ్చింది. సో జరుగుతున్న ప్రచారం అలా నిజమే అనుకోవాలి. 'హలో' పాప లవ్‌ సో క్యూట్‌ కదా.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS