హిందీ చిత్రసీమలో ఒక కాంట్రవర్సీ క్రిటిక్ గా పేరుపొందిన కమాల్ ఆర్ ఖాన్ కి సోషల్ మీడియా నెట్వర్క్ అయిన ట్విట్టర్ లో చుక్కెదురైంది.
వివరాల్లోకి వెళితే, కమాల్ ఆర్ ఖాన్ నిన్న విడుదల అయిన ఆమిర్ ఖాన్ చిత్రం సీక్రెట్ సూపర్ స్టార్ కథని విడుదలకి ముందే తన ట్విట్టర్ అకౌంట్ లో పెట్టేయడంతో ఆమిర్ ఖాన్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడ్డారు. ఇక ఈ అంశాన్ని వారు వదిలిపెట్టకుండా వెంటనే ట్విట్టర్ కి ఫిర్యాదు చేయడంతో ట్విట్టర్ తన నిభందనలకి లోబడి కమాల్ ఆర్ ఖాన్ ట్విట్టర్ ఖాతాని తీసేసింది.
దీనితో ఒక్కసారిగా షాక్ కి గురవ్వడం కమాల్ ఆర్ ఖాన్ వంతయింది. ఇప్పుడు అతని ట్విట్టర్ పేజి తెరిస్తే మనకి ట్విట్టర్ నిభంధనలు ప్రకారం ఈ సదరు అకౌంట్ తీసివేయడం జరిగింది అని మనకి కనిపిస్తున్నది.
మొత్తనికి ఆమిర్ ఖాన్ ఫ్యాన్స్ తమ హీరో చిత్రాన్ని కించపరిచినందుకు తమ సత్తా ఏంటో కమాల్ ఆర్ ఖాన్ కి చూపెట్టేశారు.